Nara Rohith: సిరితో ఏడడుగులు నడిచేది అప్పుడే.. పెళ్లి ముహూర్తంపై నారా రోహిత్ అధికారిక ప్రకటన
టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నారా రోహిత్, సిరిలేళ్ల (శిరీషా) నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో ఘనంగా జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణతో పాటు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను ఆశీర్వదించారు.

చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించాడు హీరో నారా రోహిత్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో అతను నటించిన తాజా చిత్రం భైరవం. నారా రోహిత్ తో పాటు బెల్లం కొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ హీరోలుగా నటించారు. ఆనంది, అదితీ శంకర్, దివ్యా పిళ్లై హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం (మే 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. నారా రోహిత్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. భైరవం నారా రోహిత్ కు మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడ్డాడు నారా రోహిత్. ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొన్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన పెళ్లి గురించి కూడా ఓ క్లారిటీ ఇచ్చాడు. నారా రోహిత్, సిరిలేళ్ల (శిరీషా) నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చకున్నారు.
నిజం చెప్పాలంటే ఇప్పటికే నారా రోహిత్ పెళ్లి ఇప్పటికే జరగాల్సి ఉంది. అయతే నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్ లో కన్నుమూశారు. దీంతో తమ పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నాడు నారా రోహిత్. అయితే త్వరలోనే శిరీషతో ఏడడుగులు నడవనున్నట్లు వెల్లడించాడీ హీరో. ఈ ఏడాది అక్టోబర్‌లో సిరితో తన పెళ్లి చేసుకోబోతున్నట్టు రోహిత్ అధికారికంగా ప్రకటించాడు. హిందు సంప్రదాయం ప్రకారం.. అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని నారా వారి హీరో చెప్పుకొచ్చాడు.
హీరోయిన్ సిరిలేళ్లతో నారా రోహిత్..
View this post on Instagram
కాగా ‘ప్రతినిధి2’ సినిమాలో హీరో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇక పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ఓజీ సినిమాలో సిరి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
View this post on Instagram








