పల్నాడు జిల్లా మాచర్లలో విచిత్ర అంత్యక్రియలు జరిగాయి. చనిపోయిన మిత్రుడి ఫ్లెక్సీకి స్నేహితులు పాలు, బీరు సీసాలతో అభిషేకం చేశారు. అంతేకాదు, పది రూపాయల నోట్ల కట్టలను గాలిలో విసిరారు. గుండెపోటుతో మరణించిన శీలం హరినాథ్ రెడ్డికి మిత్రులు ఈ విధంగా అరుదైన వీడ్కోలు పలికారు.