Jersey Movie: జెర్సీ రైల్వేస్టేషన్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? అసలేం జరిగిందంటే..

ఇందులో అర్జున్ పాత్రలో నాని యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. మరోసారి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక ఈ సినిమాలో రైల్వే స్టేషన్ సీన్ హైలెట్ అనే చెప్పాలి. అర్జున్ బాధ, సంతోషం రెండు ఒకేసారి వ్యక్తం చేసిన సందర్భం అది.

Jersey Movie: జెర్సీ రైల్వేస్టేషన్ సీన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? అసలేం జరిగిందంటే..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2024 | 5:34 PM

న్యాచులర్ స్టార్ నాని కెరీర్‏లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ జెర్సీ. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సేపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఈ సినిమా కొందరు కుర్రాళ్లకు ఎక్కువగా కనెక్ట్ అయిపోయింది. ఓ క్రీడాకారుడి జీవితాన్ని ప్రేక్షకుల మనసులను హత్తుకునేట్టు ఎంతో ఎమోషనల్ గా చూపించారు. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అర్జున్ పాత్రలో నాని యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. మరోసారి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక ఈ సినిమాలో రైల్వే స్టేషన్ సీన్ హైలెట్ అనే చెప్పాలి. అర్జున్ బాధ, సంతోషం రెండు ఒకేసారి వ్యక్తం చేసిన సందర్భం అది.

బాధ, సంతోషాన్ని ఎవరి ముందు వ్యక్తం చేయాలి..? ఎక్కడ బయటపెట్టాలి అనేది అర్థంకాని అర్జున్ తన బైక్ పై రైల్వే స్టేషన్ కు వెళ్తాడు. అవతలి ఫ్లాట్ ఫామ్ పై నుంచి ఓ రైలు వేగంగా వెళ్తున్నప్పుడు గట్టిగా అరుస్తూ తన మనసులోని భారాన్ని తగ్గించుకుంటాడు. ఈ సీన్ లో అర్జున్ గా నాని నటన తెరపై చూస్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడి కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. ఈ సీన్ సినిమాకే హైలెట్ అయ్యింది. అయితే ఈ సీన్ తెరకెక్కించడానికి చిత్రయూనిట్ ఎంతో కష్టపడిందట. సాధారణంగా ఇలాంటి సీన్ తీయాలంటే ముందుగా రైల్వేశాఖ అనుమతి తీసుకుని.. సన్నివేశాలకు అనుగుణంగా ట్రైన్ వెళ్లేలా ప్లాన్ చేస్తారు. కానీ ఇక్కడ రియాలిస్టిక్ గా ఉండాలనే ఉద్దేశంతో చిత్రయూనిట్ అలా చేయకుండా హైదరాబాద్ నగర శివారులోని ఓ రైల్వే స్టేషన్ లో రాత్రిపూట షూట్ ప్లాన్ చేశారట.

ఆ స్టేషన్లో చాలా తక్కువ ట్రైన్స్ వెళ్తాయి. ఒక రైలు వెళ్లిందంటే మరో రైలుకు కనీసం మూడు గంటల సమయం పడుతుంది. అందుకే ఓ రైలు వెళ్లేలోపు పర్ఫెక్ట్ షాట్ తీయాలనుకున్నారు. రైలు అవతలి ప్లాట్ ఫామ్ మీదకు రాబోతుందని తెలిసి చిత్రయూనిట్ షూట్ కోసం రెడీ అయ్యింది. నాని సీన్ చేసేందుకు రెడీ కాగా.. సడెన్ గా ఇవతలి ఫ్లాట్ ఫామ్ పైకి మరో రైలు వచ్చి సిగ్నల్ కోసం ఆగిపోయింది. ఈలోగా అటు మరో ఫ్లాట్ ఫామ్ పై రైలు వెళ్లిపోయింది. దీంతో మరో రైలు వచ్చే వరకు వెయిట్ చేసి చివరకు ఆ సీన్ తెరకెక్కించారట. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, నాని యాక్టింగ్ ప్లస్ పాయింట్ కాగా.. అనిరుధ్ మ్యూజిక్ హైలెట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.