AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: షూటింగ్‏లో ప్రమాదం.. హీరోయిన్ గొంతుకు గాయాలు.. ఫోటోస్ వైరల్..

ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ మూవీ బ్లఫ్ చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రియాంకకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. తన గొంతుకు గాయాలైనట్లు ప్రియాంక తన ఇన్ స్టా స్టోరీ ద్వారా వెల్లడించింది. అలాగే గాయాలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.

Tollywood: షూటింగ్‏లో ప్రమాదం.. హీరోయిన్ గొంతుకు గాయాలు.. ఫోటోస్ వైరల్..
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 19, 2024 | 4:43 PM

Share

మాజీ మిస్ వరల్డ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‏లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు వెబ్ సిరీస్.. ఇటు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక నటిస్తున్న హాలీవుడ్ మూవీ బ్లఫ్ చిత్రీకరణలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రియాంకకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. తన గొంతుకు గాయాలైనట్లు ప్రియాంక తన ఇన్ స్టా స్టోరీ ద్వారా వెల్లడించింది. అలాగే గాయాలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.

బుధవారం ఉదయం తన ఇన్ స్టాలో వరుస అప్డేట్స్ షేర్ చేసింది. ది బ్లఫ్ చిత్రీకరణ సమయంలో ప్రమాదం జరిగిందని.. ఈ క్రమంలోనే తన గొంతు కింద గాయమైనట్లు తెలుపుతూ ఫోటో షేర్ చేసింది. దీంతో ప్రియాంక షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారగా.. జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు ఫ్యాన్స్. ప్రియాంక నటిస్తున్న తాజా హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ చిత్రంలో బాయ్స్ ఫేమ్ కార్ల్ అర్బన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతుంది. రస్సో బ్రదర్స్ బ్యానర్, ఏజీబీఓ స్టూడియోస్ , అమెజాన్ ఎమ్ జీఎమ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా థ్రిల్లింగ్ అడ్వెంచర్‌గా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు.

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక ఇప్పుడు బీటౌన్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుని లాస్ ఏంజిల్స్ లో సెటిల్ అయిన ప్రియాంక.. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే సిటాడెల్ సిరీస్ ద్వారా నటిగా హాలీవుడ్ దర్శకనిర్మాతలను మెప్పించింది. ఇప్పుడు అక్కడే చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత