AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : 14 ఏళ్లకే తోపు హీరోయిన్.. 15 ఏళ్ల పెద్దవాడితో ప్రేమ, పెళ్లి.. 16 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు ఇలా..

ఒకప్పుడు చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోయిన్లుగా ఎదిగిన తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ భామ.. 14 ఏళ్లకే సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. 16 ఏళ్లకే తల్లైంది. దీంతో సినిమాలకు దూరమై ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుంది.

Actress : 14 ఏళ్లకే తోపు హీరోయిన్.. 15 ఏళ్ల పెద్దవాడితో ప్రేమ, పెళ్లి.. 16 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు ఇలా..
Dimple Kapadia
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2025 | 9:07 PM

Share

సినిమా ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారల జీవితాలు కనిపించినంత అందంగా ఉండవు. వెండితెరపై తమ నటనతో మెప్పించిన నటీనటుల రియల్ లైఫ్ ఊహించని కష్టాలతో సాగుతుంటాయి. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించి, తనకంటే 15 సంవత్సరాలు పెద్దవాడైన సూపర్ స్టార్ నటుడిని వివాహం చేసుకుంది ఓ హీరోయిన్. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. అదే సమయంలో సినీరంగానికి దూరమయ్యింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ నటి డింపుల్ కపాడియా. 957లో ముంబైలో ఒక సంపన్న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాజ్ కపూర్ ఆమెను చూసి తన సినిమాలో అవకాశం ఇచ్చారు. దీంతో 14 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది.

1971లో రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా బాబీ మూవీతో నటిగా అరంగేట్రం చేసింది. మొదటి సినిమా వచ్చినప్పుడు ఆమె వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. తొలి చిత్రం భారీ విజయం సాధించడంతోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది డింపుల్. దీంతో ఆమెకు హిందీలో వరుస అవకాశాలు వచ్చాయి. చేతినిండా సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఆమెను చూసి ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 1973 లో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో డింపుల్ వయసు 15 సంవత్సరాలు. రాజేష్ ఖన్నా వయసు 30 సంవత్సరాలు. ఇద్దరి మధ్య దాదాపు 15 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. ఆ తర్వాత ఏడాది ట్వింకిల్ ఖన్నాకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత తన భర్తకు సినిమాల్లో నటించడం ఇష్టం లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. దాదాపు పదేళ్లు సినిమాల్లో నటించలేదు.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

డింపుల్ కపాడియా, రాజేశ్ ఖన్నా దంపతుల కుమార్తె ట్వింకిల్ ఖన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్. పెళ్లైన 9 సంవత్సరాల వివాహం తర్వాత 1982లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. డివోర్స్ తర్వాత సినిమాల్లోకి తిరిగి వచ్చారు డింపుల్. కమల్ హాసన్ సరసన సైతం డింపుల్ నటించారు. 1973 నుంచి సినిమాల్లో నటిస్తుంది. దాదాపు 50 సంవత్సరాలుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉంది. 2020లో క్రిస్టోఫర్ నోలన్ ‘టెనెట్’ తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Dimple Kapadia New

Dimple Kapadia New

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..
కొత్త జీతం ఎలా నిర్ణయిస్తారు..? 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం..