Tollywood: టాలీవుడ్లో తోపు హీరోయిన్.. ఘోర ప్రమాదంలో గాయపడి 121 కుట్లు.. ఇప్పుడు ఇలా..
బుల్లితెర నుంచి వెండితెరపైకి అరంగేట్రం చేసి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. టీవీల్లో పలు సీరియల్స్ చేసిన కొందరు ముద్దుగుమ్మలు.. ఆ తర్వాత సినిమాల్లో వరుస ఆఫర్స్ అందుకున్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ మాత్రం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఘోర ప్రమాదానికి గురైంది.

తెలుగు సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే అందంతోపాటు అద్బుతమైన నటనతో కట్టిపడేసింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. ఘోర ప్రమాదానికి గురైంది. చివరకు ఆ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో 121 కుట్లు పడ్డాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే సనా మక్బుల్. 1993 జూన్ 13న ముంబైలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సనా.. ముంబై పబ్లిక్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, తరువాత గ్రాడ్యుయేషన్ కోసం RD నేషనల్ కాలేజీకి వెళ్లారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్, యాక్టింగ్ వైపు ఆసక్తి ఏర్పడింది. అదే సమయంలో 2009లో MTVలో వచ్చే రియాల్టీ షో స్కూటీ తీన్ దివాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని ‘ఫెమినా మిస్ బ్యూటిఫుల్ స్మైల్’ ట్యాగ్ సొంతం చేసుకుంది.
ఆ తర్వాత 2010లో ఇషాన్: సప్నో కో ఆవాజ్ దే అనే టీవీ షోతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇక తర్వాత మొహబ్బత్ హై 2, ఇస్ ప్యార్ కో క్యా నామ్ డూన్?, ఆదత్ సే మజ్‌బూర్ , విష్ వంటి సీరియల్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దిక్కులు చూడకు రామయ్య సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. అలాగే రంగూన్ మామా ఓ చందమామ వంటి చిత్రాల్లో కనిపించింది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాల్లో మెరిసింది.
అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడడంతో 121 కుట్లు పడ్డాయి. కొన్ని రోజుల క్రితం ఆమెకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చిందని తెలిపింది. శరీరంలోని కణాలు, అవయవాలపై దాడి చేస్తున్నాయని ఓ పాడ్ కాస్ట్ లో తెలిపింది. అనారోగ్య సమస్యల కారణంగా పూర్తిగా శాఖాహారిగా మారిపోయానని.. అలాగే అందుకు స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు తెలిపింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..
Tollywood: 2001 విమాన ప్రమాదంలో ఆ స్టార్ హీరో.. భుజం విరిగిపోయిన వారందరిని కాపాడి.. చివరకు..
Ramyakrishna: ఆ ఒక్క హీరోకి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించిన రమ్యకృష్ణ.. ఇంతకీ అతడు ఎవరంటే..
Tollywood: సీరియల్లో పద్దతిగా.. బయట బీభత్సంగా.. ఈ హీరోయిన్ గ్లామర్ ఫోజులు చూస్తే మెంటలెక్కిపోద్ది..
