Actress : చిరంజీవి, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.. ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్..
తెలుగు సినీపరిశ్రమలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం ఆల్ టైమ్ ఫేవరేట్. తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసిన ఆమె.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ .. అందంలో మాత్రం కట్టిపడేస్తుంది. అంతేకాదు.. ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

సినీరంగంలో హీరోయిన్ల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా ఉండవు. ఇండస్ట్రీలో సక్సెస్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో కష్టాలు ఎదుర్కొన్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం అప్పట్లో తెలుగు సినీరంగాన్ని ఓ ఊపు ఊపేసింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 100 చిత్రాల్లో నటించి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె పేరు పలువురు స్టార్ హీరోలతో ముడిపడి ఉంది.
ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..
ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నా.. రాజకీయాల్లో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ నగ్మా. సినిమా ప్రపంచంలో దాదాపు 10 భాషలలో 100 చిత్రాల్లో నటించి మెప్పించింది. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో అందరూ టాప్ హీరోల సరసన ఆడిపాడింది. అప్పట్లో ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో ఉండేది. దక్షిణాదిలో ఓ అభిమాని ఆమెకు గుడి కట్టేశాడు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
నగ్మా ఇద్దరు చెల్లెళ్లు సైతం సినిమాల్లో తోపు హీరోయిన్స్. ఆ ఇద్దరు మరెవరో కాదు.. హీరోయిన్ జ్యోతిక, రోహిణి. ప్రస్తుతం రోహిణి సినిమాలకు దూరంగా ఉండగా.. జ్యోతిక మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టింది నగ్మా. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. అప్పట్లో నగ్మా పేరు క్రికెటర్ సౌరవ్ గంగూలీతో వినిపించింది. అలాగే పలువురు హీరోలతో ప్రేమలో పడినట్లు టాక్ నడిచింది. ప్రస్తుతం నగ్మా ఒంటరిగానే ఉంటుంది.

Nagma Movie
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..








