Tollywood : ఒకప్పుడు తెలుగులో సెన్సేషన్.. సినిమాలకు దూరమైన తగ్గని డిమాండ్.. టాలీవుడ్ హీరోయిన్ గ్లామర్ సంచలనం..
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె సెన్సేషన్. తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ తనకంటూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఆమె కుర్రవాళ్ల ఆరాధ్య దేవత. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు సినిమా ప్రపంచంలో అందం, అభినయంతో అలరించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే సినీప్రియుల హృదయాలు దొచుకున్న తారలు.. అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. తర్వాత ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. టాలీవుడ్ చిత్రపరిశ్రమలో మెరుపులా వచ్చి అంతే వేగంగా ఫేడవుట అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ. తెలుగులో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. చూడచక్కని రూపం, ఉంగరాల కురులతో కట్టిపడేసింది ఈ వయ్యారి. ఈరోజు కామ్నా జెఠ్మలానీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి విషెస్ తెలుపుతున్నా్రు.
ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..
1985 డిసెంబర్ 10న ముంబైలోని ఓ సింధీ కుటుంబంలో జన్మించారు. కామ్నా జెఠ్మలానీ ప్రముఖ వ్యాపారవేత్త శ్యామ్ జెఠ్మలానీ మనవరాలు. ముంబైలోనే చదువు పూర్తి చేసిన కామ్నా.. 2004లో మిస్ ముంబై కాంటెస్ట్ లో పాల్గొని రన్నరప్ గా నిలిచారు. ఈ తర్వాత పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. అదే సమయంలో సినీరంగంవైపు అడుగులు వేశారు. ప్రేమికులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో గోపిచంద్ హీరోగా వచ్చిన రణం సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..
View this post on Instagram
ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. సామాన్యుడు, టాస్, అందమైన అబద్ధం, బెండు అప్పారావు ఆర్ఎంపీ, కత్తి కాంతారావు, శ్రీజగద్గురు ఆది సంకర, భాయ్ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ భాషలలోనూ పలు సినిమాలు చేశారు. 2014లో బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకున్నారు. 2022లో చివరగా గరుడ అనే చిత్రాల్లో నటించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..




