AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ కప్పు గెలిస్తే ఎవరీకిస్తావ్.. అమ్మకా.. ? అమ్మాయికా.. ? ఇమ్మూను ఇరికించిందిగా..

బిగ్‌బాస్ సీజన్ 9.. మరికొన్ని రోజులలో ముగింపు పలకనుంది. ఈ వారం మిడ్ విక్, వీకెండ్ ఎలిమినేషన్స్ తర్వాత టాప్ 5 మాత్రమే మిగలనున్నారు. ప్రస్తుతం హౌస్ లో వరుస టాస్కులు జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఓట్ అప్పీల్ చేసుకోనే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. అయితే అంతకుముందు అడియన్స్ ను మెప్పించాల్సి ఉంటుంది.

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ కప్పు గెలిస్తే ఎవరీకిస్తావ్.. అమ్మకా.. ? అమ్మాయికా.. ? ఇమ్మూను ఇరికించిందిగా..
Bigg Boss 9 Telugu
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2025 | 11:00 AM

Share

బిగ్‌బాస్ సీజన్ 9.. ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ పడాల మొదటి ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఇక ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ అయ్యేందుకు టాస్కులు జరుగుతున్నాయి. అయితే లీడర్ బోర్డులో టాప్ 1, 2 స్థానాల్లో ఉన్న ఇమ్మాన్యుయేల్, డీమాన్ ఇద్దరికీ బంపర్ ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్. వీరిద్దరు అడియన్స్ ను మెప్పించి ఆ తర్వాత ఓట్ అప్పీ్ల్ చేసుకోవచ్చని అన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో గార్డెన్ ఏరియాలో కొంతమంది అడియన్స్ వచ్చారు.ముందుగా అడియన్స్ ముందు ఓ ప్రశ్న పెట్టాడు. బోటు మునిగిపోతుంది. మీరు ఒక్కరినే సేవ్ చేయాలంటే డీమాన్, ఇమ్మూ ఎవరిని సేవ్ చేస్తారని అడగ్గా.. ఒకరు ఇమ్మూ పేరు.. మరో ఇద్దరూ డీమాన్ పేరు చెప్పారు. సక్సెస్ అంటే ఏంటీ అని అడగ్గా.. ఎక్కువ మంది ఇమ్మూకు సపోర్ట్ చేయడంతో అతడికి ఓట్ అప్పీల్ ఛాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి : Serial Actress : షూటింగ్ కోసం వెళ్తే అసభ్యకరమైన ఫోటో చూపించిన పెద్ద హీరో.. సీరియల్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ముందుగా అఢియన్స్ ముందుకు వచ్చిన ఇమ్మూను కొన్ని ప్రశ్నలు అడిగారు. మీరు కప్పు కొట్టాక ఫస్ట్ ఎవరి చేతికి ఇస్తారు .. మీ అమ్మకా.. లేకా ప్రేమించిన అమ్మాయికా అని అడిగారు. దీంతో ఇమ్మూ మాట్లాడుతూ..ఖచ్చితంగా మా అమ్మకే ఇస్తాను. నా జీవితంలో ఎక్కువకాలం హాస్టల్ లోనే గడిపాను. అమ్మ దగ్గర పెరిగింది తక్కువే. ఇక్కడికి వచ్చాకా ఫ్యామిలీ వాల్యూ తెలిసింది. అందుకే ముందు అమ్మ చేతికి కప్పు ఇచ్చి.. ఆ తర్వాత నీ కోసం సాధించానని అమ్మాయి చేతికి ఇస్తాను అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి : Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పటికీ సినిమాల్లో బిజీ.. 52 ఏళ్ల వయసులో ఒంటరిగా..

తర్వాత మీ స్ట్రాటజీలు బాగుంటాయి.అందుకే మీ జుట్టు ఊడిపోతుందా అని అడగ్గా.. ముందు నుంచి నా జుట్టు ఇంతే.. ఇక్కడకు వచ్చాకా మరీ రాలిపోయింది అంటూ నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చాడు. తనూజ గురించి అడగ్గా.. హౌస్ లోకి వచ్చిన తర్వాత తనకు తనూజ చాలా క్లోజ్ అయ్యిందని.. అందుకే తను ఏమైనా అంటే వెంటనే హర్ట్ అవుతున్నానని అన్నాడు. సంజనతో బాండ్ గురించి మాట్లాడుతూ.. “అమ్మ తప్పు చేసినా తప్పు తప్పని చెప్తాం.. అమ్మని మాత్రం వదిలేం కదా.. అలానే నేను కూడా ” అని అన్నాడు

ఇవి కూడా చదవండి : Bigg Boss : నా బట్టలు నా ఇష్టం.. నాకు నచ్చినట్లు నేనుంటా.. బిగ్‌బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి : Sairat : వాటే ఛేంజ్ అమ్మడు.. బాక్సాఫీస్ సెన్సేషన్.. సైరత్ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేలా ఉందంటే..