Tollywood: 15 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఆ తర్వాత సివిల్ సర్వీస్ దిశగా అడుగులు.. ఇప్పుడేం చేస్తుందంటే..
చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కథానాయికగా అలరించింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలు వదిలేసి సివిల్ సర్వీస్ దిశగా అడుగులు వేసింది. కట్ చేస్తే.. ఇప్పుడు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

చిన్నపుడు అడియన్స్ హృదయాలు గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఆమె. బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. దాదాపు 32 సినిమాలు, 48 టీవీ సీరియల్స్ చేసింది. కట్ చేస్త.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలు వదిలేసి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కోసం ప్రీపేర్ అయ్యింది. చివరకు తాను కోరుకున్న రంగంలో విజయం సాధించి ప్రస్తుతం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే ఒకప్పటి హీరోయిన్ కీర్తన. తమిళంలో కర్పూరత కొంబే, గంగా-యమునా, ముత్తిన ఆలియా, ఉపేంద్ర ఎ, లేడీ కమీషనర్, దర్వాజా, సింహాద్రి, చిగురు, బుద్నీ ఏజెంట్ వంటి అనేక సీరియల్స్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయ్యింది.
అలాగే తమిళంలో దర్శకులు సితార, రమేష్ అరవింద్ చిత్రాల్లో నటించింది. అలాంటి సమయంలో ఆమె పెద్ద నటి అయ్యే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ 15 ఏళ్ల వయసులోనే తోపు హీరోయిన్ గా మారిన ఆమె.. అప్పుడే ఇండస్ట్రీని వదిలేసింది. తాను IAS ఆఫీసర్ కావాలని కోరుకుంది. దీంతో మొదట ఆమె KAS (కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్) పరీక్షకు హాజరై, అందులో ఉత్తీర్ణత సాధించింది. రెండేళ్లు KAS అధికారిక పనిచేసింది. ఆ తర్వాత ఆమె దృష్టి UPSC (IAS) పరీక్షపై మళ్లింది. యూపీఎస్సీ పరీక్షలో 5 సార్లు ఫెయిల్ అయ్యింది. చివరకు ఆరో ప్రయత్నంలో 2020లో ఆల్ ఇండియా ర్యాంక్ 167 సాధించింది.
మొదట ఆమె మాండ్య జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసింది. ప్రస్తుతం కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. సినీరంగంలో అద్భుతమైన కెరీర్ ఉన్నప్పటికీ నటనకు దూరంగా వెళ్లిపోయిన కీర్తన… ఆ తర్వాత జాతీయ సేవ మార్గాన్ని ఎంచుకుంది.

Keerthana
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..
