AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడా? ఆఖండ 2లో ఆది పినిశెట్టి రోల్‌ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ ఎవరంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'అఖండ 2: తాండవం'. గతంలో వచ్చిన అఖండ సినిమాకు ఇది సీక్వెల్. డైరెక్టర్ బోయపాటి శీను తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

Akhanda 2: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడా? ఆఖండ 2లో ఆది పినిశెట్టి రోల్‌ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ ఎవరంటే?
Balakrishna Akhanda 2 Movie
Basha Shek
|

Updated on: Nov 30, 2025 | 2:30 PM

Share

సింహా, లెజెండ్, అఖండ తర్వాత బాలయ్య, బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తోన్న మరో సినిమా అఖండ 2 : తాండవం. గతంలో సంచలన విజయం సాధించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్స్, గ్లింప్స్, ట్రైలర్ నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉంది. ఈ మూవీలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. అలాగే బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా, జగపతి బాబు, ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, సాయి కుమార్, హర్ష తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే అఖండ 2 సినిమాలో కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలో అతని లుక్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి. సినిమాలో అతను పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆది పినిశెట్టి విలన్ గా నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఇప్పుడీ జాబితాలో అఖండ 2 కూడా చేరనుందని తెలుస్తోంది.

అయితే అఖండ 2 సినిమాలో విలన్ రోల్ కోసం ఫస్ట్ ఛాయిస్ ఆది కాదట. ముందుగా ఈ క్యారెక్టర్‌ కోసం చాలా మంది స్టార్స్ ను సంప్రదించారట డైరెక్టర్ బోయపాటి శీను. ముందుగా మంచు మనోజ్‌కు ఆఫర్ ఇచ్చారట. బోయపాటి స్వయంగా తనకు కథ వినిపించగా కొన్ని కారణాల వల్ల మనోజ్ ఈ సినిమా చేయలేకపోయాడట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం మరికొందరు హీరోలకు కూడా అప్రోచ్ అయ్యారట బోయపాటి. కానీ ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో చివరకు ఆది పినిశెట్టి దగ్గరకు ఈ రోల్ వెళ్లిందట. అతడి ఫ్రెండ్స్ కూడా ఈ క్యారెక్టర్ చేయమని సజెస్ట్ చేయమనడంతో ఆది వెంటనే కథ విన్నాడట. ఆ వెంటనే నటించేందుకు కూడా ఓకే చెప్పాడట. అలా మొత్తానికి అఖండ 2 సినిమాలో ఆది పినిశెట్టి ఫైనల్ అయ్యాడట.

అఖండ 2 సినిమాలో ఆది పినిశెట్టి లుక్కు, బాడీ లాంగ్వేజ్, నెగిటివ్ షేడ్ మొత్తం పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయట. కాబట్టి టాలీవుడ్ స్టార్స్ ఈ రోల్ చేసి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us