Sarath Babu: శరత్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? అదంతా ఇప్పుడు ఎవరికి చెందుతుందంటే
తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఇదే విషయంగా చర్చ జరగుతోంది. మరి శరత్ బాబు ఆస్తులు ఎవరికి? తన మాజీ భార్యలకా..? తన తోబుట్టువులకా..? లేక వారి పిల్లలకా..? తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తన కెరీర్ బిగినింగ్‌లోనే రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు.. ఆమెతో పడలేక విడాకులు తీసుకున్నారు.

సినీ విలాకాశంలో.. తనదైన పాత్రలతో వెలిగిపోయిన శరత్ బాబు.. ఉన్నట్టుండి అందర్నీ వదిలి వెళ్లిపోయారు. తన అభిమానులతో పాటు.. హితులను సన్నిహితులును కూడా కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. అయితే ఇన్ని రోజులు తన జ్ఙాపకాలను నెమరేసుకుంటూ ఉన్న సోషల్ మీడియా.. ఒక్క సారిగా తన ఆస్తులు ఎవరికి? అనే ప్రశ్నలతో.. నిండిపోయింది. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఇదే విషయంగా చర్చ జరగుతోంది. మరి శరత్ బాబు ఆస్తులు ఎవరికి? తన మాజీ భార్యలకా..? తన తోబుట్టువులకా..? లేక వారి పిల్లలకా..? తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తన కెరీర్ బిగినింగ్‌లోనే రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు.. ఆమెతో పడలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత స్నేహలతను పెళ్లి చేసుకుని.. ఆమెతో కూడా విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత మూడో పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. ఆయన మాత్రం దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు.
ఇలా తన వైవాహిక జీవితంలో దారుణంగా విఫలమైన శరత్ బాబు అప్పటి నుంచి తన 8 మంది అన్నదమ్ములు, 5గురు అక్కాచెల్లెళ్ల తోనే ఉమ్మడి కుంటుంబంలో కొనసాగుతున్నారు. సినిమాలు చేస్తూ వారందరి బాధ్యతలు తీసుకోవడమే కాదు.. వారి పిల్లల బాధ్యతలను కూడా తనే తీసుకుని అందరికీ పెళ్లిల్లు చేశారు. తన ఆస్తులు కూడా తన ఉమ్మడి కుటుంబానికే అన్నట్టు చాలా సందర్భాల్లో చెప్పకనే చెప్పారు.
కానీ కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఆయన సన్నిహితుల ప్రకారం ఆయన ఒక వీలునామా రాశారని అంటున్నారు. ఆ ప్రకారం తన ఆస్తి తన ఉమ్మడి కుంటుంబంలో ఉన్న 23 మందికి సమానంగా చెందుతుందని చెబుతున్నారు. కానీ మరికొంత మంది మాత్రం అలంటిదేం లేదని కొట్టిపారేస్తున్నారు. కాని శరత్ బాబు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మాత్రం.. ఆయన దశదిన కర్మ అయిపోయేంత వరకు ఆస్తుల గురించి ఏం మాట్లాడమంటూ మీడియాకు చెబుతున్నారు.