
చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అందం, అమాయకత్వం, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. కొన్నేళ్లపాటు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. దాదాపు నాలుగు పదుల వయసులోనూ ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అప్పట్లో వరుస సినిమాలతో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. ప్రస్తుతం అడవులలో ఉండే జంతువుల ఫోటోస్ మరింత అందంగా తీస్తూ తనకు నచ్చిన రంగంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపేస్తుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?
ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, బాలకృష్ణ, నితిన్ ఇలా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది ఆ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ సదా. 2003లో నితిన్ హీరోగా నటించిన జయం సినిమాతో తెలుగు చిత్ర రంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది ఈ వయ్యారి భామ. ఆ తర్వాత విక్రమ్ చియాన్ నటించిన అపరిచితుడు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.
సదా నటించిన చిత్రాలు ఆ తర్వాత నెమ్మదిగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా రాణిస్తుంది. అయితే సదా ముస్లిమ్ అని చాలా మందికి తెలియకపోవచ్చు. అవును సదా ముస్లిమ్. ఆమె అసలు పేరు సదాఫ్ మొహమ్మద్ సయీద్. మహారాష్ట్రలోని రత్నగిరిలో ముస్లిం కుటుంబంలో జన్మించింది సదా. ప్రస్తుతం బుల్లి తెర పై కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.