AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Court Movie: పెళ్లిపీటలెక్కిన ‘కోర్టు’ సినిమా డైరెక్టర్.. ఫొటోస్ వైరల్.. అమ్మాయి మరెవరో కాదు..

కోర్టు సినిమా దర్శకుడు రామ్ జగదీశ్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ కార్తీక అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. నటుడు శివాజీతో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

Court Movie: పెళ్లిపీటలెక్కిన 'కోర్టు' సినిమా డైరెక్టర్.. ఫొటోస్ వైరల్.. అమ్మాయి మరెవరో కాదు..
Court Movie Director Marriage
Basha Shek
|

Updated on: Aug 18, 2025 | 4:12 PM

Share

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన చిన్న సినిమా కోర్ట్. న్యాచురల్ స్టార్ నాని పరిమిత బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా రోషన్, శ్రీదేవి నటించగా ప్రియ దర్శి, శివాజీ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఈ కోర్టు సినిమాతోనే విశాఖపట్నం కుర్రాడు రామ్ జగదీశ్ దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తన టేకింగ్ తో మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ పెళ్లిపీటలెక్కాడు. కార్తీక అనే అమ్మాయతో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఆదివారం (ఆగస్టు 17) రాత్రి విశాఖ పట్నంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ‘కోర్ట్’ మూవీ యాక్టర్స్ రోషన్, శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యారు. రామ్ జగదీశ్ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను నటుడు శివాజీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దీంతో అవి కాస్తా నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ,నెటిజన్లు రామ్ జగదీప్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా రామ్ జగదీశ్ ది పెద్దల కుదిర్చిన వివాహ మని తెలుస్తోంది. వధువు పేరు కార్తీక అని, ఆమె ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదని తెలుస్తోంది. అయితే కార్తీక గురించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక రామ్ జగదీశ్ తన తర్వాతి సినిమాను కూడా హీరో నాని నిర్మాణంలో తీయనున్నాడని తెలుస్తోంది. ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించునున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రామ్ జగదీశ్ పెళ్లి వేడుకలో నటుడు శివాజీ..

నూతన దంపతులతో కోర్టు మూవీ హీరో, హీరోయిన్లు  రోషన్, శ్రీదేవి

View this post on Instagram

A post shared by Neeha (@cinema_ammayi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం