Varun Tej – Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్య శుభలేఖ ధర ఎంతో తెలుసా? అందుకే అన్ని లక్షలు ఖర్చు చేశారా?
నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్, లావణ్యల వివాహం జరగనుంది. పెళ్లి వేడుక కోసం ఇప్పటికే మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి చేరుకున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వరుణ్, లావణ్యల పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిల్వర్ కలర్‌లో ఉన్న ఈ శుభ లేఖలో..

టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లికి ముహూర్తం సమీపిస్తోంది. ఇటలీలోని టస్కానీలో వీరి వివాహానికి ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కాగా, నవంబర్ 1వ తేదీన వరుణ్ తేజ్, లావణ్యల వివాహం జరగనుంది. పెళ్లి వేడుక కోసం ఇప్పటికే మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి చేరుకున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వరుణ్, లావణ్యల పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిల్వర్ కలర్‌లో ఉన్న ఈ శుభ లేఖలో మొదట వరుణ్ తేజ్ తాత, నానమ్మల పేర్లను ముద్రించారు. ఆ తర్వాత వరుణ్ పెద నాన్న చిరంజీవి, బాబాయి పవన్ కల్యాణ్, చివరగా రామ్ చరణ్ ల పేర్లను పెట్టారు. అలాగే వరుణ్ తేజ్ అమ్మానాన్నల పేర్లు నాగబాబు, పద్మజ, లావణ్య తల్లి దండ్రల పేర్లు కిరణ్, దియోరాజ్ త్రిపాఠీల పేర్లను కూడా ముద్రించారు.
ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ పెళ్లి కార్డుకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే..ఈ శుభలేఖను ప్రత్యేకంగా డిజైన్ చేయించడానికి ఏకంగా రూ. 6 నుంచి 7 లక్షలు ఖర్చుపెట్టారట. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌గా మారింది. వరుణ్ పెళ్లి కార్డుతో ఒక మిడిల్ క్లాస్ పెళ్లి చేయవచ్చని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఖర్చుకు తగ్గట్టుగానే పెళ్లి కార్డు చాలా స్పెషల్‌గా ఉందట. అందుకే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మరీ ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. కాగా వరుణ్- లావణ్యల పెళ్లి వేడుకలను రామ్ చరణ్ దగ్గరుండీ చూసుకుంటున్నాడు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా సోమవారం (అక్టోబర్ 30) కాక్ టైల్ పార్టీ మొదలవుతుంది. అలాగే మంగళవారం ( అక్టోబర్ 31) మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నాయి. ఇక నవంబర్ 1న లావణ్య మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు వరుణ్. ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో అతి కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు మాత్రామే రానున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం నవంబర్ 5వ తేదీన హైదరాబాద్‍లో వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది.
కాఫీ డేట్ లో కాబోయే దంపతులు..
Lovely couple @IAmVarunTej & @Itslavanya in a coffee date, ahead of their big wedding ceremony!!☕️💓 #VarunTej #LavanyaTripathi #VarunLav pic.twitter.com/SgalYd63fD
— sumanth meda (@Sumanthmeda) October 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








