Varun Tej- Lavanya tripathi: వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ఇటలీలోనే ఎందుకో తెలుసా..? అసలు విషయం ఏంటంటే
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ని ప్రేమించిపెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం చాలా సీక్రెట్ గా ఉంచారు. ఆమధ్య ప్రేమ వార్తలు బయటకు వచ్చినా కూడా వరుణ్, లావణ్య ఎక్కడా స్పందించలేదు.

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వేడుక త్వరలో జరగనుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి చేరుకున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ని ప్రేమించిపెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లుగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం చాలా సీక్రెట్ గా ఉంచారు. ఆమధ్య ప్రేమ వార్తలు బయటకు వచ్చినా కూడా వరుణ్, లావణ్య ఎక్కడా స్పందించలేదు. వరుణ్ తేజ్ , లావణ్య ఇద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్, అలాగే అంతరిక్షం అనే సినిమాల్లో నటించారు. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఇక వరుణ్ పెళ్లివేడుకకు సర్వం సిద్ధం అయ్యింది. నిన్న మొన్నటి వరకు పెట్టి షాపింగ్ తో బిజీగా ఉన్న ఈ జంట.. ఇప్పుడు ఇటలీ చేరుకున్నారు.
వరుణ్ , తేజ్ లావణ్య పెళ్లి ఇటలీలోని ఎందుకు చేసుకుంటున్నారు..? అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కలిసి నటించిన మొదటి సినిమా మిస్టర్ మూవీ షూటింగ్ జరిగింది ఇటలీలోనే.. ఇక్కడే వరుణ్ తన ప్రేమను లావణ్యకు తెలిపాడట. లావణ్య కూడా వెంటనే ఒప్పేసుకుందట.
తమ ప్రేమ పుట్టిన చోటే పెళ్లి కూడా జరగాలని ఈ ఇద్దరు నిర్ణయించుకున్నారు. దానికే వీరి వివాహం ఇటలీలో జరగనుంది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒక్కటి కానున్నారు. నవంబర్ 1న వీరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 5న హైదరాబాద్ లో రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రిసెప్షన్ కు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
లావణ్య త్రిపాఠి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




