Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: గుంటూరు కారంలో మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా.. మార్కెట్‌లోకి కూడా వచ్చేశాయి

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది.

Mahesh Babu: గుంటూరు కారంలో మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా..  మార్కెట్‌లోకి కూడా వచ్చేశాయి
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 04, 2023 | 8:26 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ , ప్రీ లుక్స్ అంచనాలను పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ వీడియోలో మహేష్ బాబు వేసుకున్నటువంటి షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ వీడియోలో మహేష్ రెడ్ కలర్ చెక్ షర్ట్ లో కనిపించారు. లాంగ్ హెయిర్ తో తలకు గుడ్డ కట్టుకొని మాస్ లుక్ లో అదరగొట్టారు. ఒక ఫైట్ సీన్ కు సంబంధించిన ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఇక మహేష్ బాబు వేసుకున్న షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మహేష్ ధరించిన ఈ టైప్ షర్ట్స్ మార్కెట్లో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఏకంగా ఒక షర్ట్ కొంటే మరొక షర్ట్ అంటూ భారీ ఆఫర్స్ తో మార్కెట్లోకి వచ్చాయి. మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ షర్ట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు . ప్రముఖ సంస్థ అయినా ఈ కామర్స్ లో ఈ షర్ట్ అందుబాటులో ఉండటంతో అభిమానులంతా కొంటున్నారు. వెబ్సైట్లో 3 వేలకు అందుబాటులో ఉంది.