Vikramarkudu: రవితేజ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు సినిమాను మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా..?
రవితేజ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్, అలాగే దొంగ సత్తిబాబుగా నటించి మెప్పించారు. విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో సీరియస్ యాక్షన్ తో ఆకట్టుకోగా అలాగే అత్తిలి సత్తిబాబుగా కామెడీతో అలరించారు.
బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ ను అందుకున్నారు. రాజమౌళి మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క సినిమా విక్రమార్కుడు. రవితేజ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్, అలాగే దొంగ సత్తిబాబుగా నటించి మెప్పించారు. విక్రమ్ సింగ్ రాథోడ్ పాత్రలో సీరియస్ యాక్షన్ తో ఆకట్టుకోగా అలాగే అత్తిలి సత్తిబాబుగా కామెడీతో అలరించారు. ఇక ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించిన విధానం.. రవితేజ యాక్షన్ ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలిపింది. ఈ మూవీలో హీరోయిన్ గా అనుష్క నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోగా ముందుగా రాజమౌళి వేరే వారిని అనుకున్నారట. ఫైనల్ గా రవితేజతో చేశారట.
ఇంతకు విక్రమార్కుడు సినిమాను మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే.. రాజమౌళి సినిమా అంటే కాదనే హీరోలు ఉండరు. చాల మంది హీరోలకు రాజమౌళి తో సినిమా చేయాలన్నది కల. అయితే రాజమౌళి సినిమాను మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే..
రాజమౌళి ఈ సినిమాను ముందుగా నటసింహం నందమూరి బాలకృష్ణ కోసం అనుకున్నారట. ఆతర్వాత ఈ కథను పవన్ కళ్యాణ్ కు సరిగ్గా సరిపోతుందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అనుకున్నారట. అయితే ఆయన ఆసక్తి చూపక పోవడంతో ఈ మూవీ స్టోరీ రవితేజ దగ్గరకు వెళ్లిందట. ఈ మూవీతో రవితేజ తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ అందుకున్నారు.