AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pokiri Movie: ‘పోకిరి’ సినిమాకు ముందు అనుకున్న టైటిల్ అదే.. ఈ హీరో కోసం కథ రాస్తే మహేష్‏ హిట్ కొట్టాడు..

రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్స్ సృష్టించింది. ఇందులో మహేష్ పాత్రను అసలు ఫ్యాన్స్ ఊహించని రేంజ్‏లో క్రియేట్ చేశారు పూరి. తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించి పూరి, మహేష్ కెరీర్ లో అపురూప విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇటీవలే పోకిరి సినిమా తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పిందని.. తనకు ఎంతో ఇష్టమైన మూవీ అని చెప్పుకొచ్చారు మహేష్.

Pokiri Movie: 'పోకిరి' సినిమాకు ముందు అనుకున్న టైటిల్ అదే.. ఈ హీరో కోసం కథ రాస్తే మహేష్‏ హిట్ కొట్టాడు..
Pokiri Movie
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2024 | 3:39 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ మలుపు తిప్పిన సినిమాల్లో పోకిరి ఒకటి. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. మహేష్, పూరి కాంబోలో వచ్చిన ఈమూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా దాదాపు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్స్ సృష్టించింది. ఇందులో మహేష్ పాత్రను అసలు ఫ్యాన్స్ ఊహించని రేంజ్‏లో క్రియేట్ చేశారు పూరి. తెలుగు చిత్రపరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించి పూరి, మహేష్ కెరీర్ లో అపురూప విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇటీవలే పోకిరి సినిమా తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పిందని.. తనకు ఎంతో ఇష్టమైన మూవీ అని చెప్పుకొచ్చారు మహేష్. కానీ మీకు తెలుసా ?.. ఈ సినిమా కథను ముందుగా రాసుకున్నది మరో హీరో కోసం. కానీ అతడు కాకుండా మహేష్ కు హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాకు ముందుగా అనుకున్న టైటిల్ పోకిరి కాదు. అసలు విషయానికి వస్తే..

ఈ సినిమా కథను 2006కు ఆరేళ్ల ముందే రాసుకున్నారు పూరి. తన తొలి సినిమా బద్రి మూవీ కన్నా ముందే ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అయితే ఈ కథకు ముందుగా అనుకున్నది మహేష్ బాబును కాదు..మాస్ మాహారాజా రవితేజను. ఆయనతో ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య నారాయణ ‘ అనే టైటిల్ తో తెరకెక్కించాలనుకున్నారట. కానీ కొన్నికారణాలతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కొన్నాళ్లకు ఈ కథ మహేష్ వద్దకు చేరింది. ఆ తర్వాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాను పోకిరి గా మార్చారు. 2006లో విడుదలై బాక్సాఫీస్ షేక్ చేసింది ఈ సినిమా.

ఇవే కాకుండా ఈసినిమాలో హీరోయిన్ గా అనుకున్నది అయేషా టాకియాను. కానీ కొన్ని కారణాలతో ఆమె ఈ పాత్రను వదలుకుంది. ఆ తర్వాత ఆమె స్థానంలోకి కంగనా రనౌత్ వచ్చింది. ఈ చిత్రానికి ముంబయిలో అడియన్స్ జరుగుతున్న సమయంలో పక్కనే బాలీవుడ్ మూవీ గ్యాంగ్ స్టర్స్ సినిమాకు అడిషన్స్ జరిగాయి. కంగనా ఈ రెండు చిత్రాల్లో సెలక్ట్ అయ్యింది. దీంతో వీటిలో ఒక సినిమానే చేయాల్సి రావడంతో ఆమె పోకిరి మూవీని వదిలేసింది. అలా ఈ మూవీలో ఇలియానాకు ఛాన్స్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?