AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukrithi Ambati : ‘కేరింత’ బ్యూటీ గుర్తుందా ?.. నూకరాజు కోసం మళ్లీ వస్తోన్న భావన.. వీడియో వైరల్..

సుకృతి ఒకరు. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు.. కానీ కేరింత భావన అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. 2015లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి హై బడ్జెట్ లేకుండా చిన్న సినిమాగా రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో యంగ్ హీరో సుమంత్ అస్విన్, పార్వతీశం, విస్వంత్, శ్రీదివ్య, సుకృతి, తేజస్వి ప్రధాన పాత్రలలో నటించారు. అప్పట్లో ఈ సినిమా యూత్ కు తెగ కనెక్ట్ అయ్యింది.

Sukrithi Ambati : 'కేరింత' బ్యూటీ గుర్తుందా ?.. నూకరాజు కోసం మళ్లీ వస్తోన్న భావన.. వీడియో వైరల్..
Bhavana, Nookaraju
Rajitha Chanti
|

Updated on: Mar 10, 2024 | 2:05 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన నటీనటుల చాలా మంది ఉన్నారు. తమ సహజ నటనతో ప్రశంసలు అందుకుని.. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. కారణాలు తెలియదు కానీ.. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారు. అందులో సుకృతి ఒకరు. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు.. కానీ కేరింత భావన అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. 2015లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎలాంటి హై బడ్జెట్ లేకుండా చిన్న సినిమాగా రూపొందిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో యంగ్ హీరో సుమంత్ అస్విన్, పార్వతీశం, విస్వంత్, శ్రీదివ్య, సుకృతి, తేజస్వి ప్రధాన పాత్రలలో నటించారు. అప్పట్లో ఈ సినిమా యూత్ కు తెగ కనెక్ట్ అయ్యింది.

కేరింత సినిమాలో ప్రేక్షకులకు ఎక్కువగా నవ్వించి పాత్ర నూకరాజు. పట్నం కాలేజీలో చేరిన పల్లెటూరి అమాయకపు యువకుడిగా పార్వతీశం నూకరాజు పాత్రలో నవ్వించాడు. ఇక ఇందులో అతడికి జోడిగా కనిపించిన భావన పాత్రలో సుకృతి ఒదిగిపోయింది. వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత సుకృతి మరో సినిమాలో కనిపించలేదు. ఇక ఇటీవలే పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సుకృతి.. ఇప్పుడు తన స్నేహితుడి కోసం మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఉందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

నూకరాజు పాత్రలో నటించిన పార్వతీశం ఇప్పుడు హీరోగా నటిస్తున్న సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ఇందులో ప్రణీకాన్వికా కథానాయికగా నటిస్తుంది. కొత్త డైరెక్ట్ర వియస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ మార్చి 11న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో సుకృతి పాల్గొంది. మళ్లీ భావన అంటూ నూకరాజు పాత్రను గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. మరోసారి నూకరాజు, భావన ముచ్చట్లు మళ్లీ చూసేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..