AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‏‏‏Sharwanand: అరరె.. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శర్వానంద్.. కానీ ఆ హీరోకు కలిసొచ్చింది..

చాలా కాలంగా శర్వా నుంచి మరో ప్రాజెక్ట్ రాలేదు. ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒకేసారి వరుసగా సినిమాల అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు ఫుల్ జోష్ నింపాడు ఈ హీరో. ఇప్పటికే శర్వా 35, శర్వా 36 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాగా.. తాజాగా శర్వా 37 ప్రాజెక్ట్ ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో వచ్చే ఏడాది రూర్తిగా శర్వానామా సంవత్సరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

‏‏‏Sharwanand: అరరె.. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శర్వానంద్.. కానీ ఆ హీరోకు కలిసొచ్చింది..
Sharwanand
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2024 | 5:23 PM

Share

తెలుగు ఫ్యామిలీ అడియన్స్‏కు బాగా ఇష్టమైన హీరోలలో శర్వానంద్ ఒకరు. మాస్ యాక్షన్.. రొమాంటిక్ మూవీస్ కాకుండా కుటుంబసమేతంగా చూడగలిగే సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటుడిగా ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. శతమానం భవతి, గమ్యం, అమ్మ చెప్పింది, మహానుభావుడు వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. చాలా కాలంగా శర్వా నుంచి మరో ప్రాజెక్ట్ రాలేదు. ఈరోజు శర్వానంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒకేసారి వరుసగా సినిమాల అప్డేట్స్ ఇస్తూ అభిమానులకు ఫుల్ జోష్ నింపాడు ఈ హీరో. ఇప్పటికే శర్వా 35, శర్వా 36 సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాగా.. తాజాగా శర్వా 37 ప్రాజెక్ట్ ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో వచ్చే ఏడాది రూర్తిగా శర్వానామా సంవత్సరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

కానీ మీకు తెలుసా.. ఇన్నాళ్ల తన సినీ ప్రయాణం ఎన్నో సూపర్ హిట్స్ వదులుకున్నారు శర్వానంద్. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ అయిన ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని మిస్ చేసుకున్నారు. దీంతో ఆ సినిమాలో నటించిన హీరో కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకీ శర్వా మిస్ అయిన సినిమా ఏంటీ ? అనుకుంటున్నారా.. అదే ‘అర్జున్ రెడ్డి’. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. కానీ ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మాత్రం శర్వానంద్. ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు శర్వా.

అర్జున్ రెడ్డి సినిమా కథను ముందుగా శర్వాకు చెప్పారట డైరెక్టర్ సందీప్. కథ నచ్చినా.. అందులోని కొన్ని అంశాలు తనకు సెట్ కాదని అనిపించాయని.. అందుకే ఆ మూవీని వదులుకున్నట్లు చెప్పారు శర్వా. ఆ హిట్ సినిమా మిస్సైనందుకు బాధలేదని.. ఎవరికి రాసిపెట్టి ఉన్న కథలు వారికే దక్కుతాయని పేర్కొన్నారు. సందీప్ మరోసారి వెళ్లి అడిగినా.. ఆ కథ తప్ప ఏదైనా చేస్తానని అన్నారట శర్వా. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఈ మూవీతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు విజయ్.