AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు.. ఇప్పటివరకు రష్మిక అంత సంపాదించిందా ?..

కన్నడ, తెలుగు చిత్రాలలో కెరీర్‌ రాణించిన రష్మిక కొద్దికాలంలోనే తమిళం, బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించింది. 'నేషనల్ క్రష్' గా పిలుచుకునే రష్మిక... ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటు తెలుగులో పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. అలాగే త్వరలోనే యానిమల్ సినిమాతో అలరించనుంది. అయితే బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న రష్మికకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 39.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉంది.

Rashmika Mandanna: ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు.. ఇప్పటివరకు రష్మిక అంత సంపాదించిందా ?..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Oct 02, 2023 | 10:39 AM

Share

దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. అంతేకాదు ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు కూడా. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలో అందరినీ ఆకట్టుకుంది. కన్నడ, తెలుగు చిత్రాలలో కెరీర్‌ రాణించిన రష్మిక కొద్దికాలంలోనే తమిళం, బాలీవుడ్‌లో భారీ విజయాన్ని సాధించింది. ‘నేషనల్ క్రష్’ గా పిలుచుకునే రష్మిక… ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటు తెలుగులో పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. అలాగే త్వరలోనే యానిమల్ సినిమాతో అలరించనుంది. అయితే బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న రష్మికకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 39.1 మిలియన్లకు పైగా ఫాలోవర్లు కలిగి ఉంది.

ఇక రష్మిక ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. దాదాపు రూ.4 కోట్లు భారీ మొత్తాన్ని వసూలు చేస్తుంది. అలాగే అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు యాడ్స్ చేస్తుంది. రష్మిక మందన్న నికర విలువ $8 మిలియన్ USD అంటే రూ.45 కోట్లు. నివేదికల ప్రకారం, రూ.8 కోట్ల వార్షిక ఆదాయంతో నెలకు రూ.60 లక్షలు సంపాదిస్తుంది.

ఇవి కూడా చదవండి

రష్మిక బెంగళూరులో 8 కోట్ల రూపాయల ధరతో విలాసవంతమైన మాన్షన్-కమ్-విల్లాను కలిగి ఉంది. అలాగే హైదరాబాద్, ముంబై రెండింటిలోనూ విలాసవంతమైన గృహాలను కొనుగోలు చేసింది. రష్మిక మందన్న విలాసవంతమైన కార్లను కూడా ఇష్టపడుతుంది. ఈ బ్యూటీ దగ్గర రూ.1 కోటి విలువైన Mercedes Benz-C క్లాస్, రూ.40 లక్షల విలువైన Audi Q3ని కలిగి ఉంది. ఈ కార్లతో పాటు, ఆమె టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటాను కూడా కలిగి ఉంది. ఇవే కాకుండా లక్షల విలువైన లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. వీటి ధర 3-5 లక్షల రూపాయలు ఉంటుంది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న మందన్న, బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేయడానికి అడుగులు వేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
వైట్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్.. అందాలతో గత్తర లేపుతున్న రకుల్..
వైట్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్.. అందాలతో గత్తర లేపుతున్న రకుల్..
రిపబ్లిక్ డే స్పెషల్.. మీపిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే
రిపబ్లిక్ డే స్పెషల్.. మీపిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!