Meenakshi Choudhary: బంపర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. స్టార్ హీరో సరనస ఛాన్స్ అందుకున్న బ్యూటీ..
కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవలే హిట్ ది కేస్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో మీనాక్షికు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలో నటించే ఛాన్స్ అందుకుంది. ఇందులో పూజా హెగ్డే స్థానంలోకి చేరిపోయింది మీనాక్షి. ఈ సినిమాలో మీనాక్షి కన్ఫార్మ్ అయిందనే వార్తలు రావడంతో సోషల్ మీడియాలో మీనాక్షి ఫాలోయింగ్ పెరిగిపోయింది.