- Telugu News Photo Gallery Cinema photos Some thing happens with mega heroes Bad time started for them from Bro
Mega Heroes: మెగా హీరోలకు ఏమైంది..? 2023 మొదట్లో వరసగా గుడ్ న్యూస్‌లు.. ఇప్పుడు ఆలస్యం అవుతున్న చిత్రాలు..
మెగా హీరోలకు ఏమైంది..? ఆర్నెళ్లలోనే వాళ్ల సీన్ ఎందుకు రివర్స్ అయిపోయింది..? 2023 మొదట్లో వరసగా గుడ్ న్యూస్‌లు చెప్పిన వాళ్లకు ఇప్పుడేమైంది..? చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలకే ఈ ఆలస్యమెందుకు..? 2024లో ఈ ఇద్దరూ కనిపించరా..? చిరు, చరణ్‌ను స్క్రీన్‌పై చూడ్డానికి మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. మెగా హీరోలకు దిష్టి బాగా గట్టిగా తగిలినట్లుంది. సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్.. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్.. రామ్ చరణ్‌కు కూతురు పుట్టడం.. బన్నీకి నేషనల్ అవార్డ్ ఇలా వాళ్ల ఆనందానికి హద్దులే లేవు. కానీ ఉన్నట్లుండి సీన్ రివర్స్ అయిపోయింది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Oct 02, 2023 | 12:36 PM

మెగా హీరోలకు ఏమైంది..? ఆర్నెళ్లలోనే వాళ్ల సీన్ ఎందుకు రివర్స్ అయిపోయింది..? 2023 మొదట్లో వరసగా గుడ్ న్యూస్‌లు చెప్పిన వాళ్లకు ఇప్పుడేమైంది..? చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలకే ఈ ఆలస్యమెందుకు..? 2024లో ఈ ఇద్దరూ కనిపించరా..? చిరు, చరణ్‌ను స్క్రీన్‌పై చూడ్డానికి మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

మెగా హీరోలకు దిష్టి బాగా గట్టిగా తగిలినట్లుంది. ఏడాది మొదట్లో వాళ్లకు అన్నీ గుడ్ న్యూస్‌లే వచ్చాయి. వాల్తేరు వీరయ్య విజయం.. సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్.. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్.. రామ్ చరణ్‌కు కూతురు పుట్టడం.. బన్నీకి నేషనల్ అవార్డ్ ఇలా వాళ్ల ఆనందానికి హద్దులే లేవు. కానీ ఉన్నట్లుండి సీన్ రివర్స్ అయిపోయింది.

అన్నీ బాగున్నపుడు అంతా బాగానే కనిపిస్తుంది కానీ సీన్ రివర్స్ అయినపుడే తేడాలు తెలుస్తుంటాయి. మెగా హీరోల విషయంలోనూ ఇదే జరుగుతుంది. బ్రో నుంచి వాళ్లకు బ్యాడ్ టైమ్ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన భోళా శంకర్ ఫ్లాప్ అయింది.. వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున వచ్చినట్లు కూడా ఆడియన్స్‌కు ఐడియా లేదు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లేట్ అవుతూనే ఉంది.

నిజానికి గేమ్ ఛేంజర్ 2023లోనే వస్తుందని నమ్మారు రామ్ చరణ్ ఫ్యాన్స్. కానీ అనుకోని కారణాలతో ఆలస్యం అవుతూనే ఉంది. ఈ ఇయర్ మిస్సైనా 2024లో అయినా వస్తుందేమో అనుకుంటే.. ఇప్పుడది కూడా జరిగేలా కనిపించడం లేదు. గేమ్ ఛేంజర్ 2025 సంక్రాంతికి వాయిదా పడినట్లు తెలుస్తుంది. అలాగే చిరంజీవి నెక్ట్స్ మూవీ కూడా 2025లోనే వచ్చే ఛాన్స్ ఉంది.

కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథలో మార్పులు చేయాల్సి రావడంతో.. ఇది హోల్డ్‌లో పడిపోయింది. దాంతో వశిష్ట ప్రాజెక్ట్ ముందుకొచ్చింది. ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్న చిరు.. డిసెంబర్ నుంచి యాక్షన్‌లోకి దిగనున్నారు. సోషియో ఫాంటసీ కావడంతో 2025లోనే ఈ చిత్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు వశిష్ట. ఈ లెక్కన ఇటు చిరంజీవి.. అటు రామ్ చరణ్ ఇద్దరూ 2024లో కనిపించరన్నమాట.





























