- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan gives break to Ustaad Bhagath Singh and OG Movies start again after Varahi Yatra
Pawan Kalyan Movies: మొదలు కానున్న పవన్ వారాహి యాత్ర.. మరి ఉస్తాద్, ఓజి షూటింగ్స్ సంగతేంటి..
అక్టోబర్ 1 నుంచి మళ్లీ వారాహి యాత్రతో బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి రాజకీయాల వైపు వెళ్లారంటే మళ్లీ సినిమాల వైపు రావడం కష్టమే. మరి నిన్న గాక మొన్న మొదలైన ఉస్తాద్ షూటింగ్ పరిస్థితేంటి..? ఆయన కోసమే చూస్తున్న సుజీత్‌కు పవన్ ఏం చెప్పబోతున్నారు..? అక్టోబర్‌లో పవన్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? ఉస్తాద్, ఓజి ముచ్చట్లేంటి..? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇటు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. అటు సినిమాలు కూడా పూర్తి చేస్తున్నారు పవర్ స్టార్. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తైపోయింది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Oct 02, 2023 | 1:30 PM

అక్టోబర్ 1 నుంచి మళ్లీ వారాహి యాత్రతో బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి రాజకీయాల వైపు వెళ్లారంటే మళ్లీ సినిమాల వైపు రావడం కష్టమే. మరి నిన్న గాక మొన్న మొదలైన ఉస్తాద్ షూటింగ్ పరిస్థితేంటి..? ఆయన కోసమే చూస్తున్న సుజీత్‌కు పవన్ ఏం చెప్పబోతున్నారు..? అక్టోబర్‌లో పవన్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? ఉస్తాద్, ఓజి ముచ్చట్లేంటి..?

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇటు రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. అటు సినిమాలు కూడా పూర్తి చేస్తున్నారు పవర్ స్టార్. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ పూర్తైపోయింది. 5 రోజుల కిందే ఈ షెడ్యూల్ మొదలు పెట్టిన హరీష్ శంకర్ కీలకమైన సన్నివేశాలు పూర్తి చేసారు. మరీ 5 రోజులేంటి బాసూ అంటే.. గంగిగోవు పాలు గరిటెడైన చాలు అంటున్నారు.

ఈ షెడ్యూల్ అయిపోవడంతో.. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది ఉస్తాద్. ఫస్ట్ షెడ్యూల్ 8 రోజులు జరిగితే.. రెండోది 6 రోజుల్లో ముగించారు పవన్ కళ్యాణ్. అక్టోబర్ 1 నుంచి ఈయన కృష్ణా జిల్లాలో వారాహి యాత్రను మొదలు పెట్టనున్నారు. ఈ యాత్ర రెండు వారాల పాటు ఉంటుంది. దాంతో అక్టోబర్ మూడో వారం తర్వాతే మళ్లీ సినిమాల వైపు రానున్నారు పవన్ కళ్యాణ్.

అక్టోబర్ చివరి వారంలో ఓజికి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కేవలం 14 రోజులు మినహా ఈ చిత్ర షూటింగ్ అంతా అయిపోయింది. ఇప్పటికే పవన్ లేని సన్నివేశాలన్నీ చిత్రీకరించారు సుజీత్. ఆయనొస్తే మిగిలిన పోర్షన్ పూర్తి చేయాలని చూస్తున్నారు. కాకపోతే ఆ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నారు పవన్. అయితే అక్టోబర్‌లో ఎలాగైనా ఓజిని పూర్తి చేయాలనేది పవన్ ప్లాన్.

ఓజి పూర్తైతే పవన్ ఫోకస్ అంతా ఉస్తాద్ వైపు వెళ్తుంది. దాన్ని కూడా ఎప్రిల్ లోపే పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. ఎన్నికలకు ఆ సినిమాను కీలక అస్త్రంగా భావిస్తున్నారు. సినిమా అంతా పొలిటికల్ సెటైర్లతో నిండిపోయి ఉంటుందని అంచనా. హరీష్ శంకర్ కూడా దీనికి సై అన్నారు. మొత్తానికి వారాహి యాత్రతో పాటే.. ఉస్తాద్ పని పూర్తి చేయనున్నారు పవన్.





























