Nara Rohith-Sireesha: హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? ఇన్నాళ్లకు బయటకు వచ్చిన వెడ్డింగ్ వీడియో
టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి శిరీష (సిరి లేళ్ల)ల వివాహం గతేడాది అక్టోబర్ 31న ఘనంగా జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. తాజాగా నారా రోహిత్ పెళ్లి వేడుకకు సంబంధించి ఒక ఆసక్తికర వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది.

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నారా రోహిత్- శిరీషల వివాహం గతేడాది అంగరంగ వైభవంగా జరిగింది. అక్టోబర్ 31 హైదరాబాద్ వేదికగా జరిగిన వీరి వివాహ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. నారా రోహిత్ పెద నాన్న, ఏపీ ముఖ్యమంత్రి- భువనేశ్వరి దంపతులతో పాటు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు నారా రోహిత్- శిరీషల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. , తాజాగా వీరి వివాహానికి సంబంధించిన వీడియోను ఒక ఫోటోగ్రఫీ సంస్థ తమ యూట్యూబ్‌లో షేర్ చేసింది. ఇందులో తమ ప్రీ వెడ్డింగ్ షూట్, హల్డీ, సంగీత్ వేడుకల విశేషాలను చూడవచ్చు. అలాగే వధూ వరుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులను చూడవచ్చు. ఇక ఈ వీడియోలో ఎంత చూడముచ్చటగా కనిపించారు నారా రోహిత్, శిరిష. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గా మారింది. దీనిని చూసిన సెలబ్రిటీలు, సినీ అభిమానులు,నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా నారా రోహిత్, శిరీషలది ప్రేమ వివాహం. వీరిద్దరు కలిసి ప్రతినిధి 2 సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. అలా మొదలైన వారి పరిచయం పెళ్లి వరకు చేరుకుంది. ఇక శిరీష విషయానికి వస్తే.. ఆమెది ఏపీలోని రెంట చింతల. బ్యాచిలర్ డిగ్రీ వరకు సొంతూరులోనే చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసింది. కొన్ని రోజుల పాటు ఉద్యోగం కూడా చేసింది. అయితే సినిమా ఇండస్ట్రీపై మక్కువతో తిరిగి ఇండియాకు వచ్చేసింది. హైదరాబాద్ లో తన అక్క దగ్గర ఉంటూ సినిమా ఆడిషన్స్ కు హాజరైంది. ఇదే క్రమంలో ప్రతినిధి-2 మూవీ ఆడిషన్స్ కు హాజరై హీరోయిన్ గా ఎంపికైంది. ఆ తర్వాత నారా రోహిత్ తో ప్రేమలో పడింది.
నారా రోహిత్-శిరీషల వెడ్డింగ్ వీడియో..
ఇక సినిమాల విషయానికి వస్తే.. గతేడాది రెండు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు నారా రోహిత్. భైరవం, సుందర కాండ సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ హీరో ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’లో నటించనున్నట్లు తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నటిస్తోన్న ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఓ కీలకమైన పాత్రలో నారా రోహిత్ నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




