Toxic parenting: ప్రేమ పేరుతో చేసే తప్పులు.. పిల్లల ఆనందాన్ని నాశనం చేసే టాక్సిక్ పేరెంటింగ్ హ్యాబిట్స్
Parenting Mistakes: కొన్నిసార్లు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ.. తల్లిదండ్రులు తెలియకుండానే తమ పిల్లల ఆనందాన్ని దెబ్బతీసే తప్పులు చేస్తుంటారు. అందుకే తమ పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు వదులు కోవాల్సిన కొన్ని చెడ్డ ఆలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Toxic parenting habits: తమ పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, జీవితంలో విజయం సొందాలని ప్రతీ తల్లిదండ్రులూ కోరుకుంటారు. వారు తమలా కష్టాలు పడాలని కోరుకోరు. ఎటువంటి సమస్యలు లేకుండా వారి జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటారు. అయితే, కొన్నిసార్లు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ.. తల్లిదండ్రులు తెలియకుండానే తమ పిల్లల ఆనందాన్ని దెబ్బతీసే తప్పులు చేస్తుంటారు. అందుకే తమ పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు వదులు కోవాల్సిన కొన్ని చెడ్డ ఆలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇతరులతో పోలిక
భారతీయ ఇళ్లలో ఇతరులతో పోల్చడం అనేది సర్వసాధారణం అయిపోంది. పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారిని నిరుత్సాహ పరుస్తుంది. కానీ, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వెంటనే మీ పిల్లలను ఇతరులతో పోల్చడం మానుకోండి.
మీ ఇష్టాన్ని వారిపై రుద్దవద్దు
తరచుగా తల్లిదండ్రులు తమ నెరవేరని కలలను తమ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటారు. తద్వారా వారిపై భారం మోపుతారు. ఉదాహరణకు.. మేము ఉన్నత ఉద్యోగాలు సాధించలేకపోయాం.. మీరు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులు కావాలంటూ పిల్లలపై తమ ఇష్టాలను రుద్దుతుంటారు. దీంతో పిల్లలు తమకు నచ్చిన వృత్తిని ఎంచుకోలేకపోతున్నారు. ఇది వారిని తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. మీ పిల్లలకు మార్గదర్శకులుగా ఉండండి.. వారికి ఇష్టమైన వృత్తిని ఎంచుకోవడంలో సహాయపడండి. మీ పిల్లల జీవితంలోని ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకోవడం సరికాదు. తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవాలని ఆంక్షలు పెడతుంటారు. కానీ, నిరంతరం అలా చేయడం వల్ల వారు బలహీనపడతారు. వారు స్వతంత్రంగా మారగలిగేలా వారి పోరాటాలను ఎదుర్కోవడంలో వారికి సహాయం మాత్రం చేయండి చాలు.
ప్రతీదానిలో 100 శాతం ఆశించడం
మీ పిల్లల చదువు, క్రీడలు లేదా పాఠ్యేతర కార్యకలాపాలు ఇలా ప్రతిదానిలోనూ 100 శాతం పరిపూర్ణంగా ఉండాలని ఆశించవద్దు. అలా చేయడం వల్ల వారిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఎవరూ ఎప్పుడూ పరిపూర్ణులుగా ఉండరు. మనషులు తప్పులు చేయడం సహజం. వాటి నుంచి నేర్చుకుని తమ జీవితాన్ని సరైన మార్గంలో ముందుకు తీసుకెళ్తారు. అందుకే పిల్లలపై ఒత్తిడి పెంచకుండా.. వారికి అండగా నిలబడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి.
