Coolie Movie: మోనికా పాటలో పూజాతో స్టెప్పులేయాల్సింది ఈ స్టార్ హీరోనా.. ? ఎలా మిస్సైరంటే..
ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు కూలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి నిత్యం ఏదోక న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ కూలీ. జైలర్ హిట్ తర్వాత తలైవా నటిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ప్రత్యేక పాటలో స్టెప్పులు ఇరగదీసింది. ప్రస్తుతం మోనికా పాటకు యూట్యూబ్ షేక్ అవుతుంది. ఇన్నాళ్లు వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూజాకు ఈ సాంగ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. మోనిక పాటతో ఇప్పుడు పూజా పేరు మరోసారి ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. దీంతో ఇప్పుడిప్పుడే పూజాకు మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయమని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మోనికా పాటలో పూజాతో పోటీపడుతూ స్టెప్పులేశారు మలయాళీ నటుడు సౌబిన్ షాహిర్. ఈపాటలో హై ఎనర్జీతో పూజాకు సైతం గట్టిపోటి ఇచ్చారు. దీంతో ఇప్పుడు సౌబిన్ పేరు సైతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. అయితే సౌబిన్ స్థానంలో మలయాళీ స్టార్ హీరో ఉండాల్సిందంట. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో సినీప్రియులకు సుపరిచితమైన ఓ స్టార్ హీరోను ఈ సినిమా కోసం సంప్రదించగా… వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్వయంగా వెల్లడించారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
ద హాలీవుడ్ రిపోర్టర్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్ మాట్లాడుతూ.. మలయాళీ స్టార్ హీరో ఫహద్ ను దృష్టిలో పెట్టుకునే కూలీ చిత్రంలో ఆ పాత్ర రాసినట్లు తెలిపారు. తీరా అతడిని సంప్రదించగా.. అప్పటికే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ సున్నితంగా తిరస్కరించారట. అందువల్లే సౌబిన్ ను ఎంపిక చేశామని తెలిపారు. లోకేశ్ డైరెక్ట్ చేసిన కూలీ సినిమాలో నాగార్జున, శ్రుతిహాసన్, అమిర్ ఖాన్ కీలకపాత్రలు పోషించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. పహద్ ఫాజిల్ పుష్ప 1, 2 లో విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..








