Prabhas : ప్రభాస్ డూప్‏కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారంటే..

సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న సమయంలోనే సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు ప్రభాస్. ఈ మూవీలో డార్లింగ్ నట విశ్వరూపం చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు ప్రభాస్. ప్రస్తుతం రాజా సాబ్, కల్కి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. మరిన్ని ప్రాజెక్ట్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.

Prabhas : ప్రభాస్ డూప్‏కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారంటే..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 23, 2024 | 6:37 PM

వరల్డ్ వైడ్ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి సినిమాతో డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ప్రభాస్ కటౌట్, లుక్స్, యాక్టింగ్ జనాలకు తెగ నచ్చేశాయి. దీంతో ఆయనకు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత డార్లింగ్ నటిస్తోన్న చిత్రాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడం విశేషం. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న సమయంలోనే సలార్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు ప్రభాస్. ఈ మూవీలో డార్లింగ్ నట విశ్వరూపం చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశాడు ప్రభాస్. ప్రస్తుతం రాజా సాబ్, కల్కి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. మరిన్ని ప్రాజెక్ట్స్ త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

అదెంటంటే.. ఇప్పుడు ప్రభాస్ డూప్ కు ఇచ్చే రెమ్యునరేషన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ప్రభాస్ సినిమాల్లో ఆయనకు కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూప్ గా చేస్తుంటాడు. అంతకు ముందు కిరణ్ రాజ్ జనాలకు అంతగా పరిచయం లేదు. కానీ బాహుబలి సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. గతంలో కొన్ని ఇంటర్వ్యూలలోనూ పాల్గొన్నాడు. అయితే మిగతా హీరోల డూప్స్ కు సదరు సినిమాల నిర్మాతలే రెమ్యునరేషన్ ఇస్తుంటారు. కానీ ప్రభాస్ తన వద్ద పనిచేసే ప్రతి ఒక్కరికి సొంతంగా జీతాలు ఇస్తుంటారట. ఇక తన డూప్ గా నటించి కిరణ్ రాజ్ కు ఒక్కో సినిమాకు దాదాపు రూ. 30 లక్షల వరకు చెల్లిస్తాడని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈన్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. డూప్ కు ఒక్కో సినిమా అంత పెద్ద మొత్తంలో చెల్లిస్తుండడంతో ప్రభాస్ పై మరోసారి ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి సినిమా చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. అలాగే మారుతీ తెరకెక్కిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.