Tripti Dimri: ప్రియుడితో ‘యానిమల్’ బ్యూటీ సెల్ఫీ.. ఇంతకీ అతడు ఎవరో తెలుసా ?

మూవీలో ఈ బ్యూటీ ఉన్నది తక్కువ సమయమే అయినా .. అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ బ్యూటీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. యానిమల్ తర్వాత త్రిప్తికి ఆఫర్స్ ఎక్కువే వచ్చాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆషికీ 3, భూల్ భూలయ్యా 3 ప్రాజెక్టులలో ఛాన్స్ కొట్టేసింది త్రిప్తి. తాజాగా ఈ భామకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

Tripti Dimri: ప్రియుడితో 'యానిమల్' బ్యూటీ సెల్ఫీ.. ఇంతకీ అతడు ఎవరో తెలుసా ?
Tripti Dimri
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 23, 2024 | 7:02 PM

నేషనల్ క్రష్‏గా ఇమేజ్ సొంతం చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన పదేళ్లకు స్టార్ డమ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే హిందీలో పలు సినిమాలు, ఓటీటీలో వెబ్ సిరీస్ చేసిన ఈ తార.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అదే యానిమల్ మూవీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అలాగే అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించగా..సెకండ్ హీరోయిన్ గా కనిపించింది త్రిప్తి. మూవీలో ఈ బ్యూటీ ఉన్నది తక్కువ సమయమే అయినా .. అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ బ్యూటీ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. యానిమల్ తర్వాత త్రిప్తికి ఆఫర్స్ ఎక్కువే వచ్చాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆషికీ 3, భూల్ భూలయ్యా 3 ప్రాజెక్టులలో ఛాన్స్ కొట్టేసింది త్రిప్తి. తాజాగా ఈ భామకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

ఈరోజు త్రిప్తి పుట్టిన రోజు. ఈ సందర్భంగా త్రిప్తికి సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు సామ్ మర్చంట్ సైతం తన ప్రియురాలికి బర్త్ డే విషెస్ తెలిపాడు. త్రిప్తితో తీసుకున్న సెల్ఫీని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ విష్ చేశాడు. ‘హ్యాపీయెస్ట్ బర్త్‌డే డియరెస్ట్ ట్రిప్తీ’ అంటూ రాసుకొచ్చాడు సామ్ మర్చంట్. ప్రస్తుతం వీరిద్దరి సెల్ఫీ ఫోటో నెట్టింట వైరలవుతుంది. దీంతో త్రిప్తి ప్రేమ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ సామ్ మర్చంట్ ఎవరు ? అంటూ గూగుల్ ను జల్లెడ పట్టేస్తున్నారు త్రిప్తి ఫ్యాన్స్..

Tripti Dimri

Tripti Dimri

సామ్ మర్చంట్ ఎవరు ?.. త్రిప్తితో ప్రేమాయణం అంటూ తెరపైకి వచ్చిన సామ్ మర్చంట్ మోడల్. 2002లో గ్లాడ్రాగ్స్ మ్యాన్ హంట్ పోటీలో గెలిచాడు. అతడు బిజినెస్ మెన్. గోవాలో అనేక హోటళ్లు, బీచ్ క్లబ్స్ కలిగి ఉన్నాడు. అలాగే అతడు వాటర్ బీచ్ లాంజ్ & గ్రిల్, గోవాను స్థాపించాడు. ట్రిప్తీ లేదా సామ్ తమ రిలేషన్ షిప్ పుకార్లను ఇప్పటి వరకు ధృవీకరించలేదు. ట్రిప్తీ డిమ్రీ ప్రస్తుతం మేరే మెహబూబ్ మేరే సనమ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో, భూల్ భూలైయా 3, ఆషికీ 3లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.