Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas : ప్రభాస్ చేయాల్సిన సినిమా.. చివరి క్షణంలో ఆ స్టార్ హీరో వద్దకు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డార్లింగ్.. ఇటీవలే కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో సందడి చేశారు. ఈ చిత్రంలో రుద్ర పాత్రలతో మరోసారి అడియన్స్ హృదయాలను కొల్లగొట్టారు. అయితే ప్రభాస్ మిస్సైన బ్లాక్ బస్టర్ హిట్స్ గురించి మీకు తెలుసా..

Prabhas : ప్రభాస్ చేయాల్సిన సినిమా.. చివరి క్షణంలో ఆ స్టార్ హీరో వద్దకు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిట్..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jul 06, 2025 | 9:25 AM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ కామెడీ డ్రామాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. మరోవైపు డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇవే కాకుండా ప్రభాస్ ఒకే చేసిన ప్రాజెక్ట్స్ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా డార్లింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రభాస్ చేయాల్సిన ఓ సినిమాను చివరి క్షణంలో మిస్సైయారట. చివరకు మరో హీరో అదే ప్రాజెక్టుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ?

డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం డాన్ శీను. ఇందులో శ్రియ శరణ్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీహారి, కస్తూరి, అంజనా సుఖాని ముఖ్యపాత్రలు పోషించారు. 2010లో విడుదలైనఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండానే అడియన్స్ ముందుకు వచ్చి భారీ వసూళ్లు రాబ్టటింది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. నిజానికి ఈ సినిమాను ప్రభాస్ చేయాల్సిందంట.

ఇవి కూడా చదవండి

గతంలో వీరసింహరెడ్డి సినిమా ప్రమోషనల్లో డైరెక్టర్ గోపిచంద్ మలినేని మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టారు. నిజానికి ఈ సినిమా కథను ముందు ప్రభాస్ విన్నాడని.. స్క్రిప్ట్ నచ్చడంతో.. కథ రెడీ చేయ్.. చేసేద్దామని అన్నారట. కానీ ఆ వెంటనే ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడంతో ప్రభాస్ కాల్షీట్లు దొరకడానికి ఇంకొన్నాళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చిందని.. అందుకే రవితేజకు కథ చెప్పి ఓకే చేయించుకున్నానని అన్నారు. అలాగే ఇదే కథను హీరో గోపిచంద్ కు చెప్పగా.. అప్పటికే వాంటెడ్ సినిమాకు కమిట్ కావడంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారని.. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని అన్నారు.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

ఏనుగు కోసం ఏకంగా 2 గంటల పాటు నిలిచిపోయిన రైలు.. కారణం తెలిస్తే..
ఏనుగు కోసం ఏకంగా 2 గంటల పాటు నిలిచిపోయిన రైలు.. కారణం తెలిస్తే..
ఆ టాలీవుడ్ డైరెక్టర్ మూవీలో అలా కనిపించనున్న బ్యూటీ
ఆ టాలీవుడ్ డైరెక్టర్ మూవీలో అలా కనిపించనున్న బ్యూటీ
ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
ఈ కారు ధర రూ.232 కోట్లు.. ప్రపంచంలో ఈ ముగ్గురికి మాత్రమే ఉంది
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
చేసిన సినిమాలన్నీ హిట్టే.. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
స్టీల్ గిన్నెల్లో వీటిని నిల్వ చేశారో మొదటికే మోసం పక్కా.. జర భదం
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!
Viral Video: అంతటి కింగ్‌ కోబ్రాను ఒంటిచేత్తో నిలబెట్టేసాడుగా..!
రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
రైలులో యువతి రీల్.. కానీ ఊహించని గెస్ట్ ఎంట్రీతో సీన్ రివర్స్
చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? ఎంత డేంజరో తెలుసా..
ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు
ఆస్పత్రికి కేసీఆర్.. మెడికల్ టెస్టులు చేస్తున్న డాక్టర్లు
మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు..
మా అమ్మాయి తెల్లోడిని ప్రేమించిందని నా కులం వాళ్లే కుట్ర చేశారు..