AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Bhaskar: అరెరే.. సూపర్ ఛాన్స్ మిస్ అయ్యాడే.. లక్కీ భాస్కర్ సినిమాను వదిలేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..

సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుని ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో మరోసారి టాలీవుడ్ అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కానీ ఈ సినిమాను ఓ టాలీవుడ్ హీరో మిస్సయ్యాడట.

Lucky Bhaskar: అరెరే.. సూపర్ ఛాన్స్ మిస్ అయ్యాడే.. లక్కీ భాస్కర్ సినిమాను వదిలేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా..
Lucky Bhaskar
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2024 | 6:17 PM

Share

దీపావళి పండగ సందర్భంగా విడుదలైన అన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతున్నాయి. అమరన్, క, లక్కీ భాస్కర్ చిత్రాలకు అడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే ఓ రేంజ్ వసూళ్లు రాబడుతూ పోటాపోటీగా సత్తా చాటుతున్నాయి. మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దీపావళి రోజున అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులను, యూత్‏ను తెగ ఆకట్టుకుంటుంది. సీతారామం సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దుల్కర్ ఈ మూవీతో మరోసారి మెప్పించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యే అంశాలకు ఎమోషన్ జోడించి అద్భుతంగా రూపొందించాడు డైరెక్టర్ వెంకీ అట్లూరీ. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో రిలీజ్ అియన ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ.18.07 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇదిలా ఉంటే.. లక్కీ భాస్కర్ సినిమాకు దుల్కర్ సల్మాన్ ఫస్ట్ ఛాయిస్ కాదట. నిజానికి ఈ చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నాని చేయాల్సి ఉందట. ఈ సినిమా కథను ముందుగా డైరెక్టర్ వెంకీ అట్లూరి నానికి చెప్పగా.. లైన్ బాగుందని.. కానీ అప్పటికే వరుస సినిమాల్లో నటిస్తుండడంతో ఈ ప్రాజెక్టును చేయలేకపోయాడట. ఆ తర్వాత ఈ కథను దుల్కర్ సల్మాన్ కు చెప్పగా.. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇందులో మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ కావడంతో.. నాని మరో హిట్టు మిస్సయ్యాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్ జోడిగా మీనాక్షి చౌదరి నటించింది. ఈ సినిమాలో బ్యాంక్ ఉద్యోగిగా, మిడల్ క్లాస్ ఫ్యామిలీలో తండ్రిగా నటించి మరోసారి తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు దుల్కర్. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం ఈ సినిమా నవంబర్ 31న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈ మూవీ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..