AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva: ఇరుకునపడ్డ సూర్య సినిమా.. రిలీజ్‌కి ముందు కంగువాకి కష్టాలు

పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిన కంగువా మూవీ రిలీజ్‌పై సస్పెన్స్‌ నెలకొంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోర్టు మెట్లెక్కింది. దానికి కారణం ఏంటంటే?

Kanguva: ఇరుకునపడ్డ సూర్య సినిమా.. రిలీజ్‌కి ముందు కంగువాకి కష్టాలు
Kanguva
Ram Naramaneni
|

Updated on: Nov 03, 2024 | 7:42 PM

Share

హీరో సూర్య కంగువా సినిమాకి కొత్త కష్టం వచ్చిపడింది. భారీ అంచనాల నడుమ నవంబర్‌ 14న రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ మూవీకి షాక్‌ తరలిగింది. నిర్మాత కేఈ జ్ఞానవేల్‌‌పై సడన్‌గా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కోర్టుకి‌ ఎక్కింది. దాంతో రిలీజ్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. కంగువా సినిమా నిర్మాత కేఈ జ్ఞానవేల్‌‌ తమ దగ్గర 99 కోట్లకి పైగా అప్పు తీసుకున్నాడని.. కానీ ఇందులో రూ.45 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. తమకి ఇవ్వాల్సిన డబ్బుని పూర్తిగా చెల్లించే వరకూ కంగువా సినిమా రిలీజ్‌ని నిలిపివేయాలని ఆ సంస్థ కోర్టును కోరింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ కోర్టు.. వాదనలు వినేందుకు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. దాంతో సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ జోరుగా ప్రచారం చేస్తోంది. సినిమాని సూర్య భుజాలపై వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నారు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్‌లోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. మరోవైపు కంగువా -2 కూడా ఉండబోతోందని ఇప్పటికే సినిమా నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ప్రకటించేశారు. 2027లో కంగువా సీక్వెల్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు. కానీ ఇప్పుడు కంగువా ఫస్ట్‌ పార్ట్‌ రిలీజ్‌పైనే సస్పెన్స్ నెలకొంది. ఒకవేళ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ సంస్థకి అనుకూలంగా తీర్పు వస్తే నవంబరు 14న థియేటర్లలోకి కంగువా రావడం కష్టమే అన్న చర్చ జరుగుతోంది. మరి రిలీజ్ కష్టాలు తీరి నవంబరు 14న ఈ సినిమా థియేటర్లకి వస్తుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య