AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nara Rohith: ఏంటీ.. ఆ సినిమా నారా రోహిత్ చేయాల్సిందా..? ఆ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోన్న హీరోలలో నారా రోహిత్ ఒకరు. బాణం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత ప్రతినిధి, సోలో, రౌడీ ఫెలో, జో అచ్యుతానంద, అసుర వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్స్ కాలేకపోయాయి.

Nara Rohith: ఏంటీ.. ఆ సినిమా నారా రోహిత్ చేయాల్సిందా..? ఆ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన విజయ్ దేవరకొండ..
Nara Rohith, Vijay Deverakonda
Rajitha Chanti
|

Updated on: Jun 04, 2025 | 12:07 PM

Share

తెలుగు ప్రేక్షకులు పరిచయం అవసరంలేని పేరు నారా రోహిత్. బాణం సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఆయన.. ఆ తర్వాత ప్రతినిధి, సోలో, రౌడీ ఫెలో, జో అచ్యుతానంద, అసుర వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్స్ కాలేకపోయాయి. కానీ విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు నారా రోహిత్. ఇటీవలే భైరవం సినిమా అడియన్స్ ముందుకు వచ్చారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. మొదటి రోజే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నారా రోహిత్.. అనేక విషయాలు పంచుకున్నారు. పుష్ప సినిమాలోని భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ముందుగా తనకే వచ్చిందని.. కరోనా టైంలో ఆ పాత్ర గురించి ప్రొడ్యుసర్ సంప్రదించారని.. దీంతో తాను ఆలోచనలో పడ్డానని చెప్పుకొచ్చారు.

ఇలాగే విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాకు సైతం ఫస్ట్ ఛాయిస్ నారా రోహిత్ అంట. డైరెక్టర్ పరశురామ్ అంతకుముందే నారా రోహిత్ హీరోగా సోలో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక వీరిద్దరి మధ్య ఉన్న స్నేహంతోనే గీతా గోవిందం సినిమా కోసం నారా రోహిత్ ను సంప్రదించారట. ఆ సినిమాను తన సొంత బ్యానర్ పై చేయాలనుకున్నారట. కానీ గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా కమిట్ కావడంతో ఆ సినిమా చేయలేకపోయానని.. అలా గీతా గోవిందం సినిమా తనకు మిస్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను ఆ మూవీ చేసి ఉంటే అంత పెద్ద హిట్టు అయ్యేది కాదని నిజాయితీగా అంగీకరించారు. అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ నటించడం గీతా గోవిందం సినిమాకు ప్లస్ అయ్యిందని అన్నారు రోహిత్.

ప్రస్తుతం నారా రోహిత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ హీరో భైరవం మూవీతో అడియన్స్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం సుందరకాండ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పనులు కంప్లీట్ కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..