Soundarya: కమెడియన్‌తో నటించనని చెప్పిన సౌందర్య.. కట్ చేస్తే.. అతడితోనే సూపర్ హిట్ స్పెషల్ సాంగ్..
సౌందర్య.. ఇప్పటికీ తెలుగు అడియన్స్ మనసులలో చెరగని రూపం. సహజ అందం, అద్భుతమైన నటనతో కోట్లాది మంది సినీప్రియులను అలరించి సౌత్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

దక్షిణాది సినీప్రియుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ సౌందర్య. దాదాపు దశాబ్దన్నరపాటు సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అందం, అభినయంతో తన తోటి హీరోయిన్లకే చెమటలు పట్టించింది. చీరకట్టులో సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అగ్ర హీరోల సరసన నటించి తిరుగులేని స్టార్ గా ఎదిగింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుకోని ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో అగ్ర కథానాయికగా వరుస సినిమాలతో సత్తా చాటిన సౌందర్య.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ కమెడియన్ తో స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో ఆమె నటించిన సాంగ్ భారీ విజయాన్ని అందుకుంది. కానీ మొదట్లో ఆ హాస్యనటుడితో నటించనని తేగేసి చెప్పిందట. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? కమెడియన్ అలీ.
బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి.. హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అలీ. ఇప్పుడు కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న అలీ.. ఒకప్పుడు హీరోగానూ కనిపించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా నటించిన చిత్రం యమలీల. అప్పట్లో బాక్సాఫఈస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాకు హీరోగా అలీని అనుకున్నప్పుడు వద్దని చాలా మంది సలహా ఇచ్చారట. కానీ కృష్ణారెడ్డి మాత్రం అలీ అయితేనే ఈ కథకు సరిపోతాడని అన్నారట. ఆ తర్వాత కథానాయికగా సౌందర్యను ఎంపిక చేశారట. అయితే ముందు ఒప్పుకున్న సౌందర్య.. ఆ తర్వాత అలీ హీరో అని తెలియడంతో తన తండ్రి సలహాతో సినిమా నుంచి తప్పుకున్నారట. దీంతో ఆమె స్థానంలోకి ఇంద్రజను తీసుకున్నారు.
యమలీల సినిమాను చేయనని చెప్పిన సౌందర్య.. ఆ తర్వాత ఆలీతో స్పెషల్ సాంగ్ చేసింది. శుభలగ్నం సినిమాలో చినుకు చినుకు అందెలతో పాట కోసం సౌందర్యను అడిగితే మరో ఆలోచన లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అప్పట్లో వీరిద్దరి మధ్య వచ్చిన ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మొదట్లో తన తండ్రి సలహాతో అలీ సరసన నటించనని చెప్పిన సౌందర్య.. ఆ తర్వాత అతడితోనే స్పెషల్ సాంగ్ చేసి భారీ విజయాన్ని అందుకుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




