AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్ బాబు, సాయి పల్లవి కాంబోలో మిస్సైన సూపర్ హిట్.. ఏం జరిగిందంటే..

ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 29 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే మీకు తెలుసా.. మహేష్ బాబు, సాయి పల్లవి కాంబోలో ఓ సూపర్ మూవీ రావాల్సి ఉంది.

Mahesh Babu: మహేష్ బాబు, సాయి పల్లవి కాంబోలో మిస్సైన సూపర్ హిట్.. ఏం జరిగిందంటే..
Mahesh Babu, Sai Pallavi
Rajitha Chanti
|

Updated on: May 14, 2025 | 9:42 PM

Share

తెలుగు సినీరంగంలో ప్రేమకథలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అప్పుడైనా.. ఇప్పుడైనా లవ్ స్టోరీస్‏కు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇక తెలుగులో ప్రేమకథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల శైలి ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ఫిదా ఒకటి. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు ప్రేక్షకులను ఎంతగా ఆక్టట్టుకున్నాయో చెప్పక్కర్లేదు. ఇందులో మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కానీ ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబును హీరోగా అనుకున్నారట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. అయితే మహేష్ నటించాల్సిన సినిమాలోకి వరుణ్ తేజ్ ఎలా వచ్చాడో గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల.

“గోదావరి, ఆనంద్ సినిమాలు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. అదే నమ్మకంతో ఫిదా సినిమాను రాసుకున్నాను. ఈ సినిమా కథను ముందుగా మహేష్ బాబుకు వినిపించాను. ఆయనకు స్టోరీ నచ్చింది. కొన్ని మార్పులు చెప్పారు. అన్నీ ఓకే అనుకునే సమయానికి ఆయనకు డేట్స్ కుదరలేదు. ఒక నటుడి కాల్ షీట్స్ అతడి చేతిలో ఉండవు. మహేష్ అప్పటికే స్టార్ హీరో కావడంతో.. కొన్ని సినిమాలకు డేట్స్ ఇవ్వడంతో ఫిదా సినిమా సమయానికి ఆయనకు డేట్స్ అడ్జస్ట్ కాలేదు. దీంతో ఫిదా సినిమా చేయలేకపోతున్నానని చెప్పారు” అంటూ గతంలో చెప్పుకొచ్చారు డైరెక్టర్ శేఖర్ కమ్ముల.

దీంతో మహేష్ బాబు, సాయి పల్లవి కాంబోలో రావాల్సిన ఈ ప్రాజెక్ట్ మిస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు ముందు సాయి పల్లవి కాకుండా దీపికా పదుకొణెలతో అనుకున్నారట. చివరకు సాయి పల్లవి, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చింది. వీరిద్దరి జోడి ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?