AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా ఇది..! ఎలా ఉండే హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ గురూ..!

వెండితెరపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త నటీనటులు సందడి చేస్తుంటారు. ముఖ్యంగా అందాల తారలు ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అయితే తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉండగా.. ఒకటి రెండు చిత్రాలతో ఇండస్ట్రీకి దూరమైనవారున్నారు.

ఇదేందయ్యా ఇది..! ఎలా ఉండే హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ గురూ..!
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2025 | 4:17 PM

Share

సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఒకొక్క సినిమాకు కొత్త కొత్త హీరోయిన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాగే కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించి ఆతర్వాత మాయం అవుతుంటారు. చేసేది కొన్ని సినిమాలే కానీ ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం స్థానం సంపాదించుకుంటుంటారు. కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటే.. మరికొంతమంది మాత్రం ఇతర బిజినస్ లతో బిజీగా మారుతున్నారు. అందం, అభినయంతో మెప్పించి జనాల మదిలో నిలిచిపోయిన హీరోయిన్లలో ఈముద్దుగుమ్మ ఒకరు. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన సినిమాల్లో చెప్పవే చిరుగాలి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామల్లో పైన కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా.?

ఆమె పేరు అషిమా భల్లా ఒకరు. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు.. కానీ చెప్పవే చిరుగాలి హీరోయిన్ నిర్మల అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ పాత్రతో అంతగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ఈ అందాల భామ. 2001లో ఫ్యార్ జిందగీ హై అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అదే ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది.

ఆషిమా భల్లా 1983, ఆగస్టు 3న చండీగఢ్ లో జన్మించింది. తల్లిపేరు నీలిమా భల్లా. ఆషిమా ఛండిగడ్ లోని ఆర్మీ హైస్కూలులో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత ఈ అమ్మడు. తెలుగులోనే కాదు. తమిళ్, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాతో మరోసారి అలరించింది. ఇందులో నిర్మల పాత్రలో ఆమె నటన మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ చిన్నది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కోహ్లీకి కోలుకోలేని దెబ్బ.. ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్ వెనక్కి
కోహ్లీకి కోలుకోలేని దెబ్బ.. ఆరెంజ్ క్యాప్ రేసులో కింగ్ వెనక్కి
స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
స్పోర్ట్స్‌ బైక్‌ బీభత్సం.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
నెక్ట్స్ టార్గెట్‌ తెలంగాణే.. మోదీ సభతో బీజేపీ నేతల్లో కొత్త జోష్
నెక్ట్స్ టార్గెట్‌ తెలంగాణే.. మోదీ సభతో బీజేపీ నేతల్లో కొత్త జోష్
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
అతి తక్కువ టైమ్‌లో రూ.17 లక్షలు కావాలా?
మీరు స్నానం చేసే నీటిలో ఆ ఆకులు వేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
మీరు స్నానం చేసే నీటిలో ఆ ఆకులు వేస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం..
120 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 18 ఏళ్ల కుర్రాడు.. అరంగేట్రంలోనే
120 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన 18 ఏళ్ల కుర్రాడు.. అరంగేట్రంలోనే
ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లోకి బెంగళూరు.. క్వాలిఫై అవుతుందా ?
ప్లేఆఫ్స్ రేసులో టాప్‌లోకి బెంగళూరు.. క్వాలిఫై అవుతుందా ?
అబ్బ.! వీరు లవ్‌లో సూపర్ హ్యాపీ.. సుడి గట్టిగానే తిరిగింది..
అబ్బ.! వీరు లవ్‌లో సూపర్ హ్యాపీ.. సుడి గట్టిగానే తిరిగింది..
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం,వెండి ధరలు
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం,వెండి ధరలు
కేకేఆర్‌కు షాక్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందే స్టార్ ప్లేయర్ అవుట్
కేకేఆర్‌కు షాక్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందే స్టార్ ప్లేయర్ అవుట్