గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గంగోత్రి హీరోయిన్.. ఇప్పుడు చూస్తే షాక్ అవ్వాల్సిసిందే
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నారు. ఇటీవలే పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్, పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండు సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఇక పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. పుష్ప 2 సినిమా ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసింది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో బన్నీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుంది. అలాగే మరికొంతమంది కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా ఆర్తి అగర్వాల్ సిస్టర్ అదితి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిన్నది ఆ సినిమా తర్వాత పెద్దగా రాణించలేకపోయింది.
14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
కాగా ఈ చిన్నది ఓ కాంట్రవర్సీలోనూ ఇరుక్కుంది. ఓ జర్నలిస్టు పై దాడి కేసులో తండ్రి, సోదరుడితో పాటు అదితి కూడా జైల్లో ఉండాల్సివచ్చింది. గంగోత్రి సినిమా తర్వాత కొడుకు, విద్యార్థి,లోకమే కొత్తగా, ఏంబాబు లడ్డుకావాలా..? వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా రాణించలేదు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండదు అదితి అగర్వాల్. ఇక ఈ అమ్మడి ఫోటోలు అడపాదడపా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ అమ్మడు అల్లు అర్జున్ ను కలిసి అప్పుడు దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
సీన్ సీన్‌కు సితారే..! ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







