పాపం జగడం హీరోయిన్..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఏం చేస్తుందంటే..
రామ్ పోతినేని నటించిన సినిమాల్లో పేక్షకులకు ఇష్టమైన సినిమా ఏది ఆంట్ టక్కున చెప్పే పేరు జగడం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రామ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్ముడు గుర్తుందా.?

రామ్ పోతినేని, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా జగడం. ఈ సినిమా ఆశించిన స్థాయిలో థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమా ఓ కల్ట్ మూవీ అనే చెప్పాలి. సుకుమార్ డైరెక్షన్, రామ్ యాక్టింగ్ అదిరిపోతాయి. అలాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ఆడియన్స్ మైండ్ లోనుంచి బయటకు పోవడం లేదు. ఈ సినిమా పై దర్శక ధీరుడు రాజమౌళి కూడా ప్రశంసలు కురిపించారు. అసలు జగడం సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేది. ఇప్పటికి ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అవుతుందటే కదలకుండా కూర్చుంటారు ప్రేక్షకులు. అలాగే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఈ మూవీలో అన్ని పాటలు సూపర్ గా ఉంటాయి.
ఇది కూడా చదవండి : వయసులో నాకన్నా చిన్నోడే.. కానీ మగతనం ఎక్కువ.. నటి షాకింగ్ కామెంట్స్
ఇకపోతే ఈ సినిమాలో రామ్ కు జోడీగా నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు ఇషా సహానీ’ జగన్ మూవీలో ఆ చిన్నది మహేష్ బాబు ఫ్యాన్ గా కనిపించింది. అలాగే తన క్యూట్ నెస్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆమె అందానికి అపట్లో యూత్ మొత్తం ఫిదా అయ్యారు. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ మనకు ఉండాలి అని కుర్రాళ్ళు కలలు కనేలా చేసింది. అయితే జగడం సినిమా విజయం సాధించకపోవడంతో ఆమె కనిపించకుండా పోయింది. జగడం తర్వాత మరో సినిమాలో నటించలేదు ఆ హీరోయిన్.
ఇది కూడా చదవండి :పూరి సినిమాలో క్రేజీ బ్యూటీ.. విజయ్ సేతుపతికి జోడీగా బాలయ్య హీరోయిన్
ఇంతకు ఆమె ఇప్పుడు ఎలా ఉంది.? ఏం చేస్తుంది అని సోషల్ మీడియాలో తెగ గాలిస్తున్నారు నెటిజన్స్. అయితే ఇషా సహానీ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. జగడం సినిమా తర్వాత ‘బ్యాడ్ బాయ్ అనే తమిళ్ సినిమా ఒకటి చేసింది. ఆతర్వాత సినిమాల్లో నటించలేదు ఇషా సహానీ. స్వతహాగా డాన్సర్ అయిన ఈ అమ్మడు కెరీర్ బిగినింగ్ లో దక్షా సేత్ డ్యాన్స్ కంపెనీ లో మెయిన్ డ్యాన్సర్ గా పనిచేసేది. అలాగే ఎన్నో పర్ఫామెన్స్ లు కూడా ఇచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది. దాంతో తెలుగులో జగడం అవకాశం అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిన్నాది ఓ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయ్యింది. అక్కడే ఓ డ్యాన్స్ స్కూల్ ను నడుపుతుంది ఇషా సహానీ. ఈ అమ్మడికి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో ఇషా సహానీ చాలా మారిపోయింది. గుర్తుపట్టడం చాలా కష్టం..
ఇది కూడా చదవండి :నాన్న స్టార్ హీరో.. అమ్మ క్రేజీ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఈ చిన్నది ఎవరో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







