Orange: ఆరెంజ్ మూవీలోని ఈ బ్యూటీ ఫుల్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించారు. 2010లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో ఆరంజ్ సినిమా ఒకటి. అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ సినిమా ఇప్పుడు టీవీల్లో వచ్చిన కదలకుండా ఉండే అభిమానులు ఉన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా అద్భుతంగా నటించారు. 2010లో వచ్చిన ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాకు మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా జానీలియా నటించారు. అలాగే మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించింది ఆమె పేరు షాజన్ పదమ్సీ. ఆరెంజ్ మూవీలో రుబా పాత్రలో మెప్పించింది ఈ భామ.
అయితే ఇప్పుడు ఈ చిన్నది ఏం చేస్తోంది ఎక్కడ ఉంది అనియు నెటిజన్స్ గాలిస్తున్నారు. షాజన్ పదమ్సీ తొలిసారిగా హిందీలో సినిమా చేసింది రాకెట్ సింగ్: సేల్స్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌తో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్ లో ఒక సినిమా చేసి.. ఆ తర్వాత ఆరెంజ్ సినిమాలో నటించింది.
ఆ తర్వాత తెలుగులో మసాలా అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సూపర్ ధమాల్ అనే టీవీ షో చేస్తోంది. తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Shazahn Padamsee