Anandam : ఆనందం మూవీలోని ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా..

ఇక ఈ సినిమాలో  ఆకాష్, రేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.

Anandam : ఆనందం మూవీలోని ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా..
Anandam
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 02, 2023 | 12:04 PM

శ్రీను వైట్ల కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిన సినిమాల్లో ఆనందం సినిమా ఒకటి. ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమాల్లో ఆనందం ఒకటి. ఇక ఈ సినిమాలో  ఆకాష్, రేఖ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.. అలాగే రెండు కేంద్రాలలో 200 రోజులు ఆడింది ఈ సినిమా. 2001 అందమైన ప్రేమ కథతో పాటు కావాల్సినంత వినోదం కూడా ఉంది. ఇక ఈ సినిమాలో మరో ప్రేమ కథను కూడా చూపించాడు శ్రీను వైట్ల.. వెంకట్, తను రాయ్ ల మధ్య మంచి ఫీల్ ఉండే కథ ఉంటుంది. అయితే ఈ సినిమాలో నటించిన తను రాయ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఆ సినిమాలో ఎంతో అమాయకంగా అద్భుతంగా నటించి మెప్పించింది తను రాయ్. ఈ సినిమా తర్వాత తను రాయ్ పలు సినిమాల్లో నటించింది అలాగే చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది ఈ బ్యూటీ. తమిళం , మలయాళం , బెంగాలీ,  కన్నడ, తెలుగు భాషల్లో సినిమాలు చేసింది ఈ చిన్నది.

అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది ఈ భామ. ప్రస్తుతం ఈ భామ సినిమాలు తగ్గించింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది తను రాయ్. ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా. అదే అందంతో అదే వయ్యారంతో ఆకట్టుకుంటుంది తను రాయ్. Tanu RoyTanu Roy