AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దటీజ్ సూపర్ స్టార్..! కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది..!!

సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులుఉండరూ.. ఆయన ఈ లోకాన్ని విడిచిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆయన అభిమానులు కృష్ణ గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. తెలుగు సినిమాలో ఆయన ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి మెప్పించారు.

దటీజ్ సూపర్ స్టార్..! కృష్ణ చేసేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం సెల్యూట్ చేసింది..!!
Krishna
Rajeev Rayala
|

Updated on: Mar 23, 2026 | 12:29 PM

Share

తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ ఒక విశిష్టమైన స్థానం సంపాదించుకున్నారు. కొత్త సాంకేతికతలను పరిచయం చేయడంలో, విభిన్న కథాంశాలను ఎంచుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. జేమ్స్ బాండ్ తరహా సినిమాలు, సినిమా స్కోప్, కౌబాయ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆయనే. కృష్ణ అసలు పేరు శివరామకృష్ణమూర్తి. ఆదుర్తి సుబ్బారావు గారు ఆయన పేరును కృష్ణగా కుదించారు. అక్కినేని నాగేశ్వరరావు స్పూర్తితో సినిమాల్లోకి ప్రవేశించిన కృష్ణ, 1964-65లో తేనెమనసులు సినిమాతో హీరోగా పరిచయమై, గూఢచారి 116తో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో 340-350కి పైగా చిత్రాలలో నటించారు. 1970లో పద్మాలయ సంస్థను స్థాపించి, 1983లో హైదరాబాద్‌లో సొంత పద్మాలయ స్టూడియోను నెలకొల్పారు. దర్శకుడిగా 16 సినిమాలు తీశారు.

మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే

అటువంటి సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వంలో, నిర్మాణంలో వచ్చిన సింహాసనం సినిమా 1986 మార్చి 21న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. జానపద చిత్రం తీయాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకుంటూ కృష్ణ, ఈ సినిమా కోసం అప్పట్లోనే రూ 3.50 కోట్ల భారీ బడ్జెట్‌ను వెచ్చించారు. ఆ రోజుల్లో రూ 50 లక్షల బడ్జెట్ కూడా ఎక్కువ అనుకున్న సమయంలో, ఈ సినిమా బడ్జెట్ రూ 3 కోట్లు దాటుతుందని తెలిసినప్పుడు, ఇతర నిర్మాతలు నష్టపోకూడదని భావించి, తన సొంత బ్యానర్ పద్మాలయ ఫిలింస్ ద్వారానే ఈ చిత్రాన్ని నిర్మించారు కృష్ణ. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణే దర్శకత్వం వహించారు. హిందీ వెర్షన్‌లో ప్రముఖ నటుడు జితేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. సింహాసనం చిత్రం ఆ రోజుల్లో బాహుబలి చిత్రానికి సమానం అనే చెప్పాలి. భారీ బడ్జెట్, కృష్ణ లాంటి స్టార్ హీరో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.

ఆ సినిమా వల్ల అవకాశాలు చాలా తగ్గాయి.. అలాంటి పాత్రలే చేస్తా అనుకున్నారు: సత్య కృష్ణ

సినిమా విడుదల సమయంలో థియేటర్ల వద్ద ఒక కిలోమీటర్, రెండు కిలోమీటర్ల పొడవైన క్యూలైన్లు ఉండేవి. ఇది సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న విపరీతమైన ఆసక్తికి నిదర్శనం. జయప్రద, మందాకిని వంటి నటీమణులు నటించిన ఈ చిత్రం, అద్భుతమైన పాటలతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. రూ 3.50 కోట్ల పెట్టుబడితో నిర్మితమైన సింహాసనం, సుమారు రూ. 7 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇది అప్పటి రికార్డులలో ఒకటిగా నిలిచింది. సినిమా వంద రోజుల వేడుకలకు 30,000 మంది అభిమానులు మన తెలుగు రాష్ట్రాల నుంచి 400 బస్సుల్లో చెన్నైకు వెళ్లడం అప్పట్లో ఒక సంచలనం. సూపర్ స్టార్ కృష్ణకు ఆ రోజుల్లో దాదాపు 2500 అభిమాన సంఘాలు ఉండేవి.

ఇవి కూడా చదవండి

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో స్టార్ క్రికెటర్ భార్య..? ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us