Sitara Ghattamaneni: అమ్మబాబోయ్.. సితార ఇన్‌స్టా ద్వారా నెలకు అంత సంపాదిస్తుందా..?
రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు మహేష్. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికానుకగా విడుదలైన గుంటూరు కారం సినిమా పదిరోజుల్లోనే 250కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మహేష్ బాబు కూతురు సితారకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు మహేష్. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికానుకగా విడుదలైన గుంటూరు కారం సినిమా పదిరోజుల్లోనే 250కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మహేష్ బాబు కూతురు సితారకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సితార హీరోయిన్ అవ్వాలని ఆశపడుతోంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఆ విషయం చెప్పింది సితార.
సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మహేష్ బాబు సాంగ్స్ కు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఆ వీడియోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. వేలల్లో కామెంట్స్, లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. ఇటీవలే సితారయాడ్స్ కూడా చేస్తుంది. ఇటీవలే ఓ జ్యూలరీ షోరూమ్ కోసం యాడ్ లో నటించింది. ఆ యాడ్ కు వచ్చిన రెమ్యునరేషన్ ను ఛారిటీకి ఇచ్చేసింది సితార.
ఇక ఈ చిన్నారి సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా.. మాములు వల్లే ఇన్ స్టా గ్రామ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తుంటారు. ఇన్ స్టాలో సితారకు 1.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సితార యూట్యూబ్ ఛానెల్‌లోనూ 10 వేల మందికి పైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో బ్రాండ్స్, ప్రమోషన్స్ లాంటివి చేస్తుంది సితార. నెలకు ఈ అమ్మడు ఏకంగా 30లక్షల వరకు సంపాదిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో ఓ సాంగ్ లో మెరిసింది సితార. తాజాగా ఆర్ఫాన్ పిల్లలకు గుంటూరు కారం సినిమాను చూపించింది సితార.
సితార ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
