AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas, NTR: బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ప్రభాస్, ఎన్టీఆర్ హాజరుకాకపోవడానికి కారణం ఇదేనా..

ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి కొలువుదీరిన తరువాత రామమందిరంతో పాటు సరయూ నదీతీరం దీపోత్సవ్ ​కార్యక్రమంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది.. రామనామం మారుమోగింది..గర్భగుడిలో కొలువుతీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు. అయోధ్య అంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది.

Prabhas, NTR: బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ప్రభాస్, ఎన్టీఆర్ హాజరుకాకపోవడానికి కారణం ఇదేనా..
Prabhas , Ntr
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2024 | 8:47 AM

Share

అయోధ్య రామమందిరంలో బాల రాముడికి ఘనంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. ఉత్తరప్రదేశ్‌లోని రామ జన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో బాల రాముడి కొలువుదీరిన తరువాత రామమందిరంతో పాటు సరయూ నదీతీరం దీపోత్సవ్ ​కార్యక్రమంతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. రామనామం మారుమోగింది. గర్భగుడిలో కొలువుతీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు. అయోధ్య అంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొంది. అయోధ్యలో ఎటుచూసినా రామనామ సంకీర్తనలు.. ఆధ్యాత్మిక కోలాహలమే కనిపిస్తోంది.

500ఏళ్లనిరీక్షణ తర్వాత ఆకోదండరాముడ్ని దర్శించుకన్న భక్తలోకం పరవశించిపోయింది. సుమూహుర్తం ..అభిజిత్‌ లగ్నంలో 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్లు వరకు..ఈ టైమ్‌లో ఆరుగ్రహాలు అనుకూలం..అన్ని మంచి శకునాలే. సరిగ్గా 84 సెకన్లలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నిర్వఘ్నంగా..దిగ్విజయంగా పరిపూర్ణమైంది. ఈవేడుకకు యజమాని, కర్తగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైదిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్ ఈ అద్భుత ఘట్టం వీక్షించేందుకు హాజరయ్యారు. చిరంజీవి ఫ్యామితో పాటు మరికొంతమందికి కూడా ఆహ్వానం అందింది. వారిలో ప్రభాస్, ఎన్టీఆర్ కూడా ఉన్నారు. కానీ ప్రభాస్, ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఈ ఇద్దరూ తమ షూటింగ్స్ తో బిజీగా ఉండటంతో ప్రాణప్రతిష్ఠకు హాజరుకాలేదని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాషూటింగ్ లో ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు హాజరుకాలేదని తెలుస్తోంది.

ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

ఎన్టీఆర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

View this post on Instagram

A post shared by Devara Movie (@devaramovie)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి