Neru OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ మోహన్‌ లాల్‌ మూవీ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

గతేడాది క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన నేరు బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది. కేరళలో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓవరాల్‌గా రూ.86 కోట్లు రాబట్టింది. తద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా థియేటర్లలో సూపర్బ్‌ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న మోహన్‌ లాల్‌ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది

Neru OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ మోహన్‌ లాల్‌ మూవీ స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?
Neru Movie
Follow us

|

Updated on: Jan 23, 2024 | 8:15 AM

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. ఆయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా విడుదలై సూపర్‌ హిట్‌గా నిలుస్తుంటాయి. అలా ఈ మధ్యన మోహన్‌ లాల్‌ నటించిన చిత్రం నేరు. దృశ్యం, 12th మ్యాన్ సినిమాలతో మోహన్‌లాల్‌కు మర్చిపోలేని బ్లాక్‌ బస్టర్స్‌ ఇచ్చిన జీతూ జోసెఫే దీనికి కూడా దర్శకత్వం వహించారు. గతేడాది క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదలైన నేరు బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది. కేరళలో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓవరాల్‌గా రూ.86 కోట్లు రాబట్టింది. తద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాల్లో ఐదో స్థానంలో నిలిచింది. ఇలా థియేటర్లలో సూపర్బ్‌ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న మోహన్‌ లాల్‌ సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ నేరు సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో మంగళవారం (జనవరి 23) అర్ధరాత్రి నుంచే మోహన్‌ లాల్‌ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.

నేరు సినిమాలో మోహన్ లాల్ తోపాటు ప్రియమణి, శాంతి, జగదీశ్, గణేష్ కుమార్, నందు, అదితి రవిలాంటి వాళ్లు నటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఇదొక కోర్టు రూమ్‌ డ్రామా. మోహన్‌లాల్‌ కొన్ని కారణాలతో లాయర్‌ ప్రాక్టీస్‌ మానేస్తాడు. అదే సమయంలో ఒక కేసు కోసం మళ్లీ నల్లకోటు వేసుకుంటాడు. అయితే ప్రాక్టీస్‌ లేకపోవడంతో విచారణలో సరైన ప్రశ్నలు అడగలేకపోతాడు. న్యాయం కోసం పరితపించే మోహనల్‌ లాల్‌ ఎందుకు ప్రాక్టీస్‌ మానేశాడు? మళ్లీ ఎందుకు నల్లకోటుల వేసుకున్నాడు? ఇంతకీ కేసు ఏంటి? అందులో గెలిచాడా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే నేరూ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles