Ayalaan OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న శివకార్తికేయన్ అయలాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే
రెమో, డాక్టర్ వరుణ్, డాన్, ప్రిన్స్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ప్రిన్స్ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఇక ఇటీవలే శివకార్తికేయన్ అయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయలాన్ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ తెలుగు రిలీజ్ ను మాత్రం వాయిదా వేశారు.
శివ కార్తికేయన్ కు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకున్నాయి. రెమో, డాక్టర్ వరుణ్, డాన్, ప్రిన్స్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ప్రిన్స్ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఇక ఇటీవలే శివకార్తికేయన్ అయలాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయలాన్ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ తెలుగు రిలీజ్ ను మాత్రం వాయిదా వేశారు. సంక్రాంతికి గట్టిపోటీ ఉండటంతో అయలాన్ తెలుగు రిలీజ్ వాయిదా పడింది. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. అలాగే బాక్సాఫిస్ దగ్గర ఓ మోస్తరు వసూళ్లను రాబట్టింది ఈ సినిమా.
అయలాన్ సినిమాకు పోటీగా కోలీవుడ్ లో కెప్టెన్ మిల్లర్ సినిమా రిలీజ్ అయ్యింది. ఏలియన్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాకు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయలాన్ సినిమా ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్.
అయలాన్ సినిమా ఓటీటీ ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ త్వరలోనే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 16 అయలాన్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంచనున్నారు. అయలాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ హైలైట్ అనే చెప్పాలి. అందుకే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఆలస్యం అయ్యింది. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఎనిమిదేళ్లు జరిగిందట.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి