Brahmamudi : సీరియల్‌లో టామ్ బాయ్‌లా.. బయట మాత్రం టాప్ లేపేలా..!

ఒకొక్క సీరియల్ మినిమమ్ రెండు మూడు ఏళ్ళు నడుతున్నాయంటే దానికి కారణం ఆ సీరియల్స్ ను ప్రేక్షకులు ఆదరించడమే. ఇప్పటికే చాలా సీరియల్స్ ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కోసం ఆడవాళ్లే కాదు ఈ మధ్య మగవాళ్లు కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు.

Brahmamudi : సీరియల్‌లో టామ్ బాయ్‌లా.. బయట మాత్రం టాప్ లేపేలా..!
Brahmamudi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2024 | 12:50 PM

సినిమాలతో సమానంగా సీరియల్స్ కూడా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే మరో పక్క సీరియల్స్ ఏడాది పొడవునా సాగుతూ.. ఇంట్లో ఉండేవారిని అలరిస్తున్నాయి. ఒకొక్క సీరియల్ మినిమమ్ రెండు, మూడు ఏళ్ళు నడుస్తుంటాయి.. దానికి కారణం ఆ సీరియల్స్ ను ప్రేక్షకులు అంతలా ఆదరించడమే. ఇప్పటికే చాలా సీరియల్స్ ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ సీరియల్ కోసం ఆడవాళ్లే కాదు ఈ మధ్య మగవాళ్లు కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు. టీవీ చూసే టైం లేకపోతే ఫోన్ లలోనూ సీరియల్స్ చూస్తున్నారు కొందరు. అంతలా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ సీరియల్. ఇక ఈ సీరియల్ లో నటించే చాలా మంది ప్రేక్షకుల ఫెవరెట్ అయిపోతున్నారు. వారిలో పైన కనిపిస్తున్న అమ్మాయి ఒకరు.

బ్రహ్మముడి సీరియల్లో అప్పు పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ టామ్ బాయ్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది ఆ చిన్నది. ఆమె బయట ఎలా ఉంటుందో తెలుసా..? స్టార్ మా ఛానల్లో బ్రహ్మముడి సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్‏తో టాప్ స్థానంలో దూసుకుపోతుంది. ఇందులోని కావ్య, స్వప్న, అప్పు, రాజ్, కళ్యాణ్, రాహుల్ పాత్రలు ఎక్కువగా జనాలకు కనెక్ట్ అయ్యాయి. అయితే ఈ సీరియల్లో అందరికి తెగ నచ్చేసిన క్యారెక్టర్ అంటే అప్పుదే. ఆమె అసలు పేరు నైనిషా రాయ్.

నైనిషా రాయ్ చాలా అందంగా ఉంటుంది. సీరియల్ లో అలా టామ్ బాయ్ లా కనిపిస్తుంది కానీ బయట ముద్దుగా ఉంటుంది ఈ భామ. గతంలో ఓ ఇంటర్వ్యూలో నైనిషా రాయ్ మాట్లాడుతూ.. ఇంటర్ చదువుతున్న సమయంలో తనకు సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపింది. సీరియల్స్ పై ఇంట్రెస్ట్ లేకుండానే సీరియల్స్ లో నటించానని కానీ ఇప్పుడు ఫేమ్ రావడంతో బ్రేక్ కూడా దొరకడం లేదు అని తెలిపింది. ప్రస్తుతం వరుస సీరియల్స్ లో బిజీగా ఉంది ఈ చిన్నది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

నైనిషా రాయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Nainisha (@nainisha_rai)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.