Sreeleela: అందరిలానే శ్రీలీల కూడా.. తెలుగులో ప్రయాణం మొదలుపెట్టి బీ టౌన్ పై ఫోకస్..
ప్లాన్ A వర్కవుట్ కానపుడు కచ్చితంగా ప్లాన్ B ఉండాల్సిందే. ఇప్పుడు ఇదే అప్లై చేస్తున్నారు శ్రీలీల. ఇన్నాళ్ళూ తెలుగులో సత్తా చూపించిన ఈ బ్యూటీ.. ఇకపై తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీపై ఫోకస్ చేయాలనే నిర్ణయానికి వచ్చేసారు. ఈ క్రమంలోనే అమ్మడి చూపు ముంబైపై పడింది. మరి శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుంది..? టాలీవుడ్ బ్యూటీస్ ఇక్కడెంత మెరిసినా.. చివరికి వాళ్లు చేరాల్సిన గమ్యం మాత్రం బాలీవుడ్డే.