Hansika Motwani: సినిమాలు లేకపోయినా తగ్గని డిమాండ్.. హాన్సిక సంపాదన తెలిస్తే మతిపోద్ది సామీ.. ఆస్తులు ఎంతంటే..

బాలనటిగా తెరంగేట్రం చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా మారిన తారలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో హాన్సిక మోత్వానీ ఒకరు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టింగ్ గా ఉంటుంది. ఇంతకీ ఈ అమ్మడు సంపాదన ఎంతో తెలుసా.. ?

Hansika Motwani: సినిమాలు లేకపోయినా తగ్గని డిమాండ్.. హాన్సిక సంపాదన తెలిస్తే మతిపోద్ది సామీ.. ఆస్తులు ఎంతంటే..
Hansika

Updated on: Nov 21, 2025 | 10:35 AM

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు హాన్సిక మోత్వాని. దక్షిణాదిలో అత్యంత గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఆమె ఒకరు. బాలనటిగా తెరంగేట్రం చేసిన హాన్సిక.. ఆ తర్వాత కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ మూవీలోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. డిసెంబర్ 2022లో జైపూర్‌లోని ముండోటా కోటలో తన స్నేహితుడు సోహైల్ కతురియాను వివాహం చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న హాన్సిక.. బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు పేరు తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..

రెండేళ్ల వైవాహిక జీవితంలో మనస్పర్థలు వచ్చాయని.. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ రూమర్స్ పై హాన్సిక స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన పేరు మార్చుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. తెలుగు, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు పర్సనల్ లైఫ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు జనాలు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..

నివేదికల ప్రకారం హాన్సిక ఆస్తులు రూ.50 కోట్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ఆమె ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట. ఇవే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్, వ్యాపారంలోనూ ఎక్కువగా సంపాదిస్తుంది. అలాగే తన భర్తతోకలిసి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని సైతం రన్ చేస్తుంది. హాన్సిక వద్ద రూ.10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం ఎదురుచూచ్తుంది హాన్సిక.

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..

ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..