Dude Movie: కలెక్షన్స్ కొల్లగొడుతున్న డ్యూడ్.. మమితను ప్రదీప్ రంగనాథన్ ఫస్ట్ టైమ్ ఎక్కడ చూశారో తెలుసా ?
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమాల్లో డ్యూడ్ ఒకటి. దీపావళీ కానుకగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన డ్యూడ్ చిత్రానికి యూత్, ఫ్యామిలీ అడియన్స్ నుంచి ఆదరణ లభిస్తుంది. మరోవైపు తెలుగుతోపాటు తమిళంలో ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబడుతుంది. ఈ క్రమంలోనే ఈ మూవీ హిట్ పెయిర్ మమితా, ప్రదీప్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.

కొన్ని కాంబినేషన్ల కోసం చాలా సందర్బాల్లో ముమ్మరంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ, అనుకున్నప్పుడు వర్కవుట్ కావు. కానీ, అనుకోని సందర్భాల్లో స్క్రీన్ మీద తళుక్కుమంటాయి. అలాంటి కాంబో డ్యూడ్ మూవీకి కుదిరిందని అంటున్నారు ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా నటించిన సినిమా ‘డ్యూడ్’. మమిత బైజు హీరోయిన్‌గా నటించారు. ”డ్యూడ్‌లో నేను చేసిన కేరక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అసలు ఇలాంటి రోల్ కెరీర్లో ఇంత ఎర్లీ స్టేజ్‌లో చేస్తానని నేను ఊహించనేలేదు. అందుకే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. డైలాగులు కూడా రాత్రుళ్లు ఇంటికి తీసుకెళ్లి బట్టీపట్టేదాన్ని. నిద్రపోకుండా ప్రాక్టీస్ చేసేదాన్ని. లైన్స్ గుర్తుంటే కెమెరా ముందు ఎంతైనా ఎమోషన్స్ పండించడానికి వెసులుబాటు ఉంటుంది. ఆ విషయం డ్యూడ్‌తో నాకు బాగా తెలిసొచ్చింది. ఫ్యూచర్‌లోనూ ఇలాంటి కేరక్టర్లు వచ్చినప్పుడు ఈ ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది” అని అన్నారు మమిత.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
అసలు మమితతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు ప్రదీప్ రంగనాథన్. ”మమిత సినిమాల్లోకి రాకముందు ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించారు. ఆమె అప్పడాన్ని విరగ్గొట్టి తినే సీన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను సినిమా చేసేటప్పుడు మమితను తీసుకోవాలనుకున్నా. కానీ ఆ సమయంలో వనంగాన్‌కి డేట్స్ ఇచ్చారు మమిత. (సూర్య చేయాల్సిన సినిమా వనంగాన్.. స్టార్ట్ కాకముందే ఆగిపోయింది. సూర్య ప్లేస్‌లో మరో హీరో చేశారు. సూర్యని అనుకున్నప్పుడు మమితను అనుకున్నారు. ఆ తర్వాత ఈక్వేషన్స్ మారిపోయాయి).
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
అరే.. మంచి పెర్ఫార్మర్‌ని మిస్ అయ్యామే అనుకున్నా. కానీ డ్యూడ్ చేసే సమయంలో మమిత బైజును హీరోయిన్‌గా అనుకుంటున్నట్టు డైరక్టర్ చెప్పారు. వినగానే నాకు అప్పటిదాకా జరిగిందంతా కళ్ల ముందు తిరిగింది” అని అన్నారు ప్రదీప్ రంగనాథన్. ఈ దీపావళికి విడుదలైన డ్యూడ్ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోవైపు భారీగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఈ చిత్రంలో మమితా, ప్రదీప్ జంటగా నటించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
